‘అంటుకట్టు పద్ధతి’ తో అధిక దిగుబడి… పది మందికి ఆదర్శమైన రైతు

కరోనా తర్వాత పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో మార్పులు వస్తున్నాయి. యువకులు కూడా వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ఇందులో సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా అనుసరించే యువకులున్నాయి. ఇందుకు పాత పద్ధతులు, సాంకేతికతను కూడా జోడిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్ల జిల్లాకి చెందిన ఓ యువ రైతు కూరగాయల సాగులో నూతన పద్ధతులను అవలంబిస్తున్నాడు. పండ్ల మొక్కలకే ‘‘అంటు పద్ధతి’’ తెలుసు. కానీ… కూరగాయల మొక్కలకు కూడా ‘‘అంటు పద్ధతి’’ని అవలంబించాడు. రెట్టింపు దిగుమతిని పొందుతున్నాడు. దీంతో మిగిలిన రైతులు కూడా దీనివైపు మొగ్గు చూపుతున్నారు. వంకాయ సాగులో ఈ అంటు పద్ధతిని ఫాలో అవుతున్నాడు.

 

అడవి జాతి వంకాయ మొక్కకు, మాములు జాతి వంకాయ మొక్కకు అంటు కట్టాడు. దీంతో ఇవి తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకోవడంత పాటు అధిక దిగుబడి కూడా వస్తుందని తెలుసుకున్నాడు.దీంతో ఒక్కో మొక్కకు 9 రూపాయల చొప్పున కొనుగోలు చేసి, 1400 చొప్పున తనకున్న మూడు ఎకరాల్లో నాటాడు. ఇలా చేయడం ద్వారా వంకాయ పంటలకు అధికంగా సోకే అజింక వైరస్ ను ఈ మొక్కలు తట్టుకోవడంతో పాటు దిగుబడి అధికంగా వస్తుందని తెలిపాడు. 75 రోజుల తర్వాత దిగుబడి రావడం ప్రారంభమైందని, రెండు రోజులకోసారి రెండు క్వింటాళ్ల దిగుబడిని ఈ యువ రైతు సాధిస్తున్నాడు.

తాను ప్రతియేటా కూరగాయ పంటను సాగుచేసేవాడినని, అయితే దిగుబడి తక్కువగా వచ్చేదన్నాడు. అయితే… తన మిత్రుల ద్వారా ఈ అంటు పద్ధతిని తెలుసుకున్నానని, దీంతో మొదట వంకాయ వేసినట్లు తెలిపాడు. భారీగా వర్షాలు కురిసినా… మొక్క చనిపోక… ఏపుగా పెరిగి మంచి దిగుబడిని ఇచ్చాయని సంతోష్ తెలిపాడు. అంటు పద్ధతి ద్వారా సాగు రైతులకు లాభదాయకంగా వుందన్నారు. వంకాయ సాగులో గతంలో నామ మాత్రంగానే దిగుబడి వచ్చేది. ఏడాది పాటే దిగుబడి వచ్చేది. కానీ అంటు పద్ధతితో రెండింతల దిగుబడి వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *