అంత పెద్ద విమాన ప్రమాదమైనా… భగవద్గీత మాత్రం చెక్కు చెదరనేలేదు
అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులు కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. ఇదిలా వుండగా.. ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ విమాన శకలాల్లో చెక్కుచెదరకుండా హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత లభించింది. అట్ట మీద కొన్ని గీతలు పడ్డాయి కానీ… ఆ పుస్తకం అంతా చెక్కుచెదరకుండానే వుంది. ఇస్కాన్ వ్యవస్థాపకుడు స్వామి ప్రభుపాద చిత్రం సహా ఏ ఫొటో కూడా దెబ్బతినలేదు. ఒక్కచోట ఓ పేజీ మాసినట్టు కనిపించినా గ్రంథం మొత్తం బాగానే ఉంది.ప్రమాద సమయంలో దాదాపు వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వున్నా… పవిత్రమైన భగవద్గీత మాత్రం పాడవలేదు. ఈ సమయంలో ఎవరో ప్రయాణికులు దీనిని పారాయణ చేసినట్లు చెబుతున్నారు.