అఖండభారతాన్నినెలకొల్పుదామని సంకల్పం చేద్దాం..
“14 ఆగష్టు…అఖండ భారత సంకల్ప దివస్”
“ఉత్తరం యత్సముద్రస్య, హిమాద్రేశ్చైవ దక్షిణం |
వర్షం తద్భారతం నామ, భారతీ యత్ర సంతతి:” ||
“సముద్రానికి ఉత్తరాన, తూర్పు పడమరలకు శాఖోపశాఖలుగా వ్యాపించివున్న హిమవత్పర్వతశ్రేణులకు దక్షిణాన ఉన్న భూమి భారత వర్షము, దాని సంతానము భారతీయులు” .
మన ఇతిహాసాలు, పురాణాలు కూడా మన మాతృభూమి ఎంతో విశాలమైనదని ప్రకటిస్తున్నాయి. నేటి ఆఫ్ఘనిస్థాన్ ఒకనాటి మన ఉపగణస్థానము. మహాభారతంలో శల్యుని స్థానం అదే. నేటి కాబూల్, కాందహార్ ఒకనాటి గాంధార దేశం. కౌరవుల తల్లి గాంధారి జన్మించినది ఇక్కడే. నేటి ఇరాన్ కూడా ఒకప్పటి మన దేశమే. మనకు పవిత్ర తీర్థ స్థలమై, సాక్షాత్తూ పరమశివుడి నివాసమైన కైలాసగిరులు, మానససరోవరం ప్రస్తుతం చైనా కౌగిలిలో ఉన్నాయి. పూర్వం త్రివిష్ఠపం ఇప్పుడు టిబెట్‌గా వ్యవహరింపబడుతున్నది. బర్మా ఒకప్పటి బ్రహ్మదేశం, సింగపూర్ ఒకప్పటి శృంగపురం. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
అఖండ భారతదేశంలో సుమారుగా అరవై శాతం భూభాగాన్ని కొంతమంది స్వార్ధపరుల మూలాన కోల్పోయాము. ఏనాటికైనా మనం కోల్పోయిన భూభాగాలను తిరిగి సాధించుకొని అఖండభారతాన్నినెలకొల్పుదామని సంకల్పం చేద్దాం.
“జై అఖండ భారత్, జై హిందూరాష్ట్ర”
అఖండ భారత దేశ వైశాల్యము 72,54,000 చ.కిమీ
కోల్పోయిన భూభాగములు (చ. కి.మీలలో)
భూటాన్ 47,500
టిబెట్ 12,46,000
ఆఫ్ఘనిస్థాన్ 6,62,000
శ్రీలంక 66,000
నేపాల్ 1,50,500
బర్మా 6,89,000
పాకిస్తాన్ 8,10,500
బంగ్లాదేశ్ 1,50,500
మాల్దీవులు 300
స్వాతంత్య్రానంతరం…
పాక్ ఆక్రమిత కాశ్మీర్ 78,000
చైనా కబళించిన లడ్డాక్ 37,500
మిగిలినది 33,16,500
(అంకెలు దగ్గరగా సవరించబడినవి)