అయోధ్య దర్శన వేళల్లో మార్పులు… తక్షణం అమలులోకి
యూపీలోని అయోధ్య రామ మందిర దర్శన వేళల్లో ట్రస్టు మార్పులు చేసింది. ఈ మార్పులు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఈ మార్పుల ప్రకారం తెల్లవారుఝాము 4:30 గంటలకు మంగళహారతి, 6:30 గ్ంటలకు శృంగార్ హారతి ఇవ్వనున్నారు. అలాగే భక్తులకు ఉదయం 7 గంటల నుంచి ఆలయ ప్రవేశం వుంటుంది.
మధ్యాహ్నం 12:00 గంటలకు రాజ్ భోగ హారతి, ఆ తర్వాత 12:30 నుంచి 1:00 గంట వరకు ఆలయాన్ని మూసేస్తారు. ఒంటి గంటలకు దర్శనం పున: ప్రారంభం అవుతుంది. రాత్రి 9:30 నిమిషాల వరకూ కొనసాగుతుంది. అయితే.. భక్తులను మాత్రం రాత్రి 8:30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా.. స్వామివారి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆలయ దర్శన సమయ వ్యవధిని గంట మేర తగ్గించినట్లు ట్రస్ట్ తెలియజేసింది.