అరటి డొప్పలతో చేతి సంచులు: విద్యార్థుల అద్భుత నైపుణ్యం

ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ వారు మాట్లాడే ఆంగ్ల మాటలు అదేవిధంగా వారు తయారు చేస్తున్న పరికరాలు ప్రత్యేకంగా పలువురిని ఆకట్టుకుంటున్నాయి ఆ విశేషాలు ఒకసారి చూద్దాం.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లా అది జిల్లాలోని బెండపూడి ప్రభుత్వ పాఠశాల అంటే ఆంగ్లభాష తనదైన శైలిలో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది అటువంటి బెండపూడి కి సమీపానగల ఏపీ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రత్యేక పరికరాలు తయారు చేస్తూ అందరు మనల్ని పొందుతున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు స్వచ్ఛంద సంస్థలో పెడుతున్న కార్యక్రమాల్లో వారి ప్రతిభను బయటకి చూపిస్తున్నారు.

కాకినాడ జిల్లా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులు ప్లాస్టిక్ అనే మహా భూతం ప్రజల్ని కాదు సకల జీవరాసులను కూడా ఇబ్బంది పెడుతుందని గుర్తించారు. ప్లాస్టిక్ కవర్ అనేది సర్వ జీవరాశులను, మనుషులను సైతం తీవ్ర ఇబ్బందులు పెడుతుందని ఈ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు పేర్కొన్నారు.

దీంతో తక్కువ ఖర్చుతో దాదాపు ఆరు మాసాల్లో డీకంపోజ్ అయ్యే విధంగా ఒక బ్యాగ్ తయారు చేసేందుకు ఈ విద్యార్థులు రూపకల్పన చేశారు. అరటి చెట్టు అనేది ఒకసారి మాత్రమే రైతుకు ఉపయోగపడుతుందని, ఇక రెండవసారి అది ఉపయోగపడదని, ఆతరుణంలో ఆ అరటి దుప్పను తీసుకుని మనం దానిని ఎండబెట్టి అందులో ఒక పదార్థం వేసి అనంతరం రెండూ కలిపి మిక్సీ చేయాలని విద్యార్థులు వివరించారు. ఆ తర్వాత అందులో మరో మిశ్రమం కలిపి బ్యాగ్ తయారు చేస్తామని చెప్పారు.

ఇలా తక్కువ ఖర్చుతో బ్యాగులు తయారు చేసుకుంటూ ప్లాస్టిక్ ని దూరంగా పెట్టొచ్చన్నారు. ఈ అరటి బ్యాగ్ ఎంతో ఉపయోగపడుతుందని కాకినాడ జిల్లా రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు చెబుతున్నారు. ఈ బ్యాగ్ తయారు చేసే విధానాన్ని సైతం ప్రదర్శించి ఆకట్టుకుంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *