అల్లం 

కరోన కాలంలో ఆలోచన అంతా వైరస్‌ ‌బారినపడకుండా ఉండడం ఎలా అనే. పరిశుభ్రతతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగ నిరోధకశక్తి పెంపొందించు కోవాలని ఆయుష్‌ ‌మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. ఈ రోగనిరోధక శక్తిని పెంపొందించే అనేక పదార్ధాలను మనం ఇప్పటికే విరివిగా వాడుతున్నాం. కాబట్టి ఆ అలవాటును కొనసాగిస్తే సరిపోతుంది. ఇలాంటి పదార్ధాల్లో ఒకటి అల్లం. దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.

అల్లం రసం, జీలకఱ్ఱ, వాము కలిపి ప్రతిదినం తీసుకున్నట్లయితే భయంకరమైన జీర్ణాశయ వ్యాధులు కూడా దూరం అవుతాయి.

అల్లం, లవణ భాస్కరం (ఒక రకమైన ఉప్పు) కలిపి తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

అల్లం, బెల్లం, నెయ్యి కలిపి వేడిచేసి తీసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.

గంధం లాగా పొడి అల్లం పట్టీ కట్టడం వల్ల వలన తలనొప్పి, జలుబు నుంచి చాలా ఉపశమనం కలుగుతుంది.

అల్లం రసం రోజుకు 5 మార్లు తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.

చిన్న పిల్లలకు వేడి పాలలో అల్లం పొడి కలిపి ఇస్తే చాలా మంచిది.

అల్లం, పసుపు, 1 గ్లాసు నీళ్ళతో కాచి కషాయం త్రాగడం వల్ల కీళ్ళనొప్పులు చాలా వరకు తగ్గుతాయి.

అల్లం ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచే చేస్తుందే కానీ హాని మాత్రం చేయదు.

– ఉషాలావణ్య పప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *