ఆడపిల్ల కుటుంబాలకు ‘‘మా ఊరి మహాలక్ష్మీ’’ భరోసా… ఆ గ్రామం ఆదర్శం
ఆడపిల్ల జన్మ విషయంలో కరీనంగర్ లోని కొండాయపల్లి ప్రపంచానికి ఓ మంచి సంకేతాన్ని పంపింది. ఆడపిల్ల పుడితే… గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడో అక్కడ విడిచిపెట్టి వచ్చేవారు ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తుంటారు. ఆర్థికంగా భారమని కూడా అనుకునేవారున్నారు. కానీ… ఈ అభిప్రాయాన్ని మార్చేసింది ఈ ఊరు. ఆడపిల్ల పుడితే..ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లే అని చూపించాలని భావించింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లి గ్రామం ఓ మహత్తర కార్యక్రమం రూపొందించింది. ఆడపిల్ల పుడితే బాధపడటం, వారి భవిష్యత్తును ఆలోచిస్తూ బాధపడటం… ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయకపోవడాన్ని స్థానికుడైన రేండ్ల శ్రీనివాస్ కళ్లారా చూశారు. దీంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘‘మా ఊరి మహాలక్ష్మీ’’ పేరుతో ఏకంగా ఓ ట్రస్టును స్థాపించారు.
ఈ ట్రస్టులో స్థానికులతో పాటు దేశ విదేశాల్లో స్థిరపడిన గ్రామస్థులను కొందర్ని సభ్యులుగా వుంచారు. ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా… ఆ బిడ్డ పేరు మీద సుకన్య సమృద్ధి యోజనా ఖాతా తెరుస్తారు. అందులో 10,116 రూపాయలను డిపాజిట్ చేస్తారు. ఆపై సర్టిఫికట్ ని తల్లిదండ్రులకు అందిస్తుంది. అలా ఇప్పటి వరకూ 54 మంది ఆడబిడ్డల పేరిట డబ్బులు డిపాజిట్ చేశారు. గత యేడాది ఇదే ఊళ్లో అయిదుగురు అమ్మాయిలు జన్మించారు.వారంరికీ సుకన్య సమృద్ధి యోజన పత్రాలు ఇచ్చారు. నిరుపేద బాలికలకు చదువు సంధ్యలకు కూడా సాయం చేస్తున్నారు.
మా ఊరు మహాలక్ష్మి పౌండేషన్ ఏర్పాటు పల్లెవాసుల్లో ఆర్థిక ప్రోత్సాహం పెరిగింది. అయితే, గ్రామస్థులకు మొదట నిధులు రాబట్టడం కష్టంగా మారింది. దీంతో 2017లో గ్రామంలో 10 మంది అడబిడ్డలు పుట్టడంతో గ్రామస్థులు, ఎన్నారై ల సహకారంతో గ్రామం తరుపున ఐదువేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ప్రతిసంవత్సరం ఆడబిడ్డలకు మా ఊరు మాహలక్ష్మీ పౌండేషన్ గ్రామంలో అందరి సమక్షంలో పండుగ వాతావరణంలో పోస్టాఫీసులో జమచేసిన ఫిక్స్‌డ్ బాండులు ప్రజాప్రతినిధులని పిలిచి తల్లిదండ్రులకి ఇస్తున్నారు.
ఇప్పటికీ ఏడు సంవత్సరాలలో గ్రామంలో పుట్టిన అడబిడ్డలు అందరికి దాదాపుగా 60 మంది కి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడమే కాకుండా తల్లిదండ్రులు కూడా ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు పొదుపు చేసుకునేలా దగ్గర ఉండి చూపిస్తున్నారు. గ్రామస్థులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే రూ.5,000 తోపాటుగా తల్లిదండ్రులు మరో రూ. 5,000 కలిపి జమ చేస్తున్నారు. అడబిడ్డ పెండ్లీడు వచ్చే సమయానికి దాదాపుగా ఒక లక్ష ముప్పై వేల వరకు జమ అవుతాయి. గ్రామంలో పుట్టిన ఆడబిడ్డకి కన్న ఊరే, ఒక మేనమామలాగా అర్థిక సహాయం అందిస్తుందని, దీంతో పెళ్లి చేసే కుటుంబానికి భారం తగ్గుతుంది.
తమ గ్రామంలో పుట్టిన అడబిడ్డలకు అండగా నిలవడమే కాకుండా తమ గ్రామంలో ఏదైనా ఏదైనా కుటుంబ పెద్ద గల్ఫ్ లో మరణిస్తే, కుటుంబ పెద్దలాగా గ్రామ అండగా నిలుస్తోంది. మా ఊరు మాహాలక్ష్మీ పౌండేషన్ ద్వారా ఆడబిడ్డల పేరు మీద పదివేల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందికి బాసటగా నిలిచారు. సొంత కుటుంబ సభ్యులే ఆదుకోని ఈ రోజులలో కొండయ్యపల్లి గ్రామం అడబిడ్డలకు అండగా నిలుస్తూ రాష్ట్రంలోనే అదర్శంగా నిలుస్తుంది.