ఆదర్శవంతమైన రాజు
శివాజీ మహారాజ్‌కి మించిన మహా నాయకుడు, తపస్వీ, భక్తుడు, ప్రజారంజకుడైన రాజు మరొకరు ఉన్నారా? ఒక మహత్కా ర్యాన్ని జన్మించారు. అసాధారణమైన జీవితం ఆయనది. రాజు అనేవాడు ఎలా ఉండాలో, ఎలా ఉంటాడో ఆయన జీవితం చూస్తే తెలుస్తుంది. హిందూజాతి ఆత్మ చైతన్యానికి ప్రతినిధి ఆయన. చిన్నచిన్న రాజ్యాలన్నీ ఒక ఛత్రం కిందకు వచ్చి ఒక సువిశాలమైన, సమైక్య హిందూ సామ్రాజ్యంగా రూపుదిద్దు కుంటుందని చాటి చెప్పిన సాటిలేని వీరుడాయన.
దేశం, ధర్మం పూర్తిగా నాశన మవుతాయనే ప్రమాదం ఏర్పడినప్పుడు వాటిని సంరక్షించినవాడు శివాజీ మహారాజ్. మన ప్రాచీన గ్రంధాల్లో చెప్పిన ఆదర్శవంతమైన రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయి. ఈ దేశపు నిర్భీతి స్వభావానికి, మృత్యుంజయ త్వానికి ప్రతీక ఆయన.
– స్వామీ వివేకానంద