ఆరెస్సెస్ కార్యకర్తపై సీపీఎం కార్యకర్తల దాడి
కేరళలోని కన్నూర్ జిల్లాలో సీపీఎం పార్టీ గుండాలు రెచ్చిపోయారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తపై దారుణంగా దాడి చేశారు. ఈ నెల 11 న కన్నూర్ లో పానూర్ పొయిలూర్ ముత్తప్పన్ మదప్పుర పండగ సందర్భంగా ఆరెస్సెస్ కార్యకర్త షాజుపై ఎనిమిది మంది కమ్యూనిస్టులు దాడి చేశారు. కత్తులు, ఇనుపరాడ్ తో దాడికి దిగారు.
ఎఫ్ఐఆర్ సమాచారం ప్రకారం… పండుగ రోజున ఆరెస్సెస్ కార్యకర్త షాజూ, అతని స్నేహితులను కమ్యూనిస్టు గుండాలు మొదట చంపేస్తామని బెదిరించారు. తర్వాత షాజూ తలపై కత్తులు, చేతులపై ఇనుప రాడ్లతో తీవ్రంగా దాడికి దిగారు. దీంతో ఆరెస్సెస్ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆరెస్సెస్ కార్యకర్తపై అత్యత క్రూరంగా దాడులకు దిగిన కమ్యూనిస్టు గూండాలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం 189(2), 191(2), 191(3), 126(2), 118(1), 109(1), 351, మరియు 190 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే హత్యాయత్నం, ప్రాణాంత ఆయుధాలు కలిగి వున్నారన్న అభియోగాలపై కేసులు నమోదయ్యాయి.
కేరళలోని కన్నూర్ ప్రాంతం చాలా రోజులుగా రాజకీయ హింసకు కేంద్రంగా నిలుస్తోంది. సైద్ధాంతిక ఘర్షణలు తరుచూ జరుగుతుంటాయి. ఈ దేశం కోసం పనిచేస్తున్న స్వయంసేవకులపై సీపీఎం పార్టీ నేతలు, వామపక్ష భావజాలం వున్న వారు తరుచూ భౌతిక దాడులకు దిగుతుంటారు. చాలా సార్లు స్వయంసేవకులు తమ ప్రాణాలకు తెగించి, మరీ సైద్ధాంతిక నిబద్ధతను చాటుతున్నారు. మరోవైపు ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. దాడులు చేసిన వారిపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం రాజకీయ దాడులను ప్రోత్సహిస్తోందని మండిపడింది.