ఆర్‌.ఎస్‌.ఎస్‌-‌సేవాభారతి ఆధ్వర్యంలో కోవిడ్‌ ‌సహాయక చర్యలు

తెలంగాణ ప్రాంతంలో

గత రెండు నెలలుగా కోవిడ్‌ ‌రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌, ‌సేవాభారతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది. కోవిడ్‌ అనుమానితులకు ఐసోలేషన్‌ ‌కేంద్రాలు, కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లు ఏర్పాటు, వ్యాధి గ్రస్తులకు, వారి కుటుంబ సభ్యులకు ఆహార పంపిణీ, రక్తదానం, ప్లాస్మ దానం, వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమాలు, వైద్య సిబ్బందికి సహాకార, అంబులెన్సు సేవలు, కోవిడ్‌తో మరణించిన వారికి అంత్యక్రియల నిర్వహణ, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం, ఆక్సిజన్‌ ‌సిలండర్‌ ‌సమకూర్చడం, కోవిడ్‌ ‌మెడిక్‌ ‌కిట్లు, మాస్కులు, కషాయం పంపిణీ, కోవిడ్‌ ‌హెల్ప్‌లైన్‌ ‌సెంటర్ల ఏర్పాటు వంటి అనేక సహాయక చర్యల్లో ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌సేవాభారతి కోవిడ్‌ ‌కష్ట కాలంలో అనేక మందికి అండగా నిలిచింది. ఇందుకోసం అనేక మంది స్వయంసేవకులు, కార్యకర్తలు తమ వంతు సహాయ సహకారాన్ని అందించారు.

జూన్‌ 10 ‌వరకు ఆర్‌.ఎస్‌.ఎస్‌, ‌సేవాభారతి చేస్తున్న సేవా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి..

రాష్ట్ర వ్యాప్తంగా 15 ప్రదేశాల్లో కోవిడ్‌ ‌హెల్ప్‌లైన్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన వైద్యులతో కోవిడ్‌ ‌వైద్య సలహాలు, సూచలను అందజేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక హెల్ప్‌లైన్‌ ‌కేంద్రాన్ని ఏర్పాటు చేసిన 181 మంది వైద్యులు సలహాలందించారు. సుమారు 9050 మంది ఈ హెల్ల్‌ట్కన్‌ ‌సెంటర్‌ ‌ద్వారా లబ్ధి పొందారు. 30 టీకా కేంద్రాల్లో 250 మంది ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌కార్యకర్తలు టీకా నిర్వహణలో వైద్య సిబ్బందికి సహకారం అందించారు. 5 నగరాల్లో ఐసోలేషన్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 480 పడకలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 457 మంది ఐసోలేషన్‌ ‌కేంద్రాన్ని వినియోగించు కున్నారు. ఈ ఐసోలేషన్‌ ‌కేంద్రాల నిర్వహణలో 112 మంది స్వయంసేవలకులు నిమగ్నమయ్యారు. అలాగే 65 ఆక్సిజన్‌ ‌పడకలతో ఒక కోవిడ్‌ ‌కేర్‌ ‌సేంటర్‌ ‌ను ఏర్పాటు చేశారు. 9 నగరాల్లో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్‌యలో 70మంది స్వయంసేవకలు పాల్గొని అక్కడి వైద్యసిబ్బందికి సహకారాన్ని అందించారు.

కోవిడ్‌ ‌సోకిన వారికి 35 ప్రదేశాల్లో 1100 ఆహార ప్యాకెట్లను సేవా భారతి ద్వారా పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 ప్రదేశాల్లో రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేసి 5890 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అలాగే 12 ప్రదేశాల్లో ప్లాస్మ దాన శిబిరాలు ఏర్పాటు చేశారు. దీని వల్ల 85 మంది లబ్ధి పొందారు. 8 ప్రదేశాల్లో 1250 మందికి ఆయూర్వేద కషయాన్ని పంపణీ చేశారు. కోవిడ్‌ ‌తో మృతి చెందిన 280 మంది అంత్యక్రియలను సేవాభారతి కార్యకర్తలు దగ్గరుండి నిర్వహించారు. 3 ప్రదేశాల్లో మృతదేహాలను తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు.

650 మందికి ఆయూష్‌ – 64 ‌కిట్లను పంపిణీ చేశారు. అలాగే 60 చోట్ల 120 ఆక్సిజన్‌ ‌సిలండర్లు ఏర్పాటు చేసి 405 మంది కోవిడ్‌ ‌బాధితులకు ఆక్సిజన్‌ అం‌దజేశారు. కోవిడ్‌ ‌వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 336 ప్రదేశాల్లో ఉన్న 4500 మంది నిరుపేద కుంటుంబాలకు 18,000 ఉచిత రేషన్‌ ‌కిట్లను సేవాభారతి అందజేసింది. అలాగే 35 ప్రదేశాల్లో 690 ఆహార పొట్లాలను అందజేసింది.

80 ప్రదేశాల్లో 700 మందికి ఉచిత కోవిడ్‌ ‌మెడికల్‌ ‌కిట్లను అందజేసింది. పల్స్ ఆక్సీమీటర్‌ను 50 ప్రదేశాల్లో 450 మందికి పంపిణీ చేయగా 1400 మంది లబ్ధి పొందారు. 15,000 మాస్కులు, 4000 గ్లౌజులు, 65,00 శానిటైజర్లు, 400 పిపిఈ కిట్లను సేవాభారతి పంపిణీ చేసింది. 7 వాహనాలతో 6 చోట్ల అంబులెన్సు సేవలను ప్రారంభించింది. దీని వల్ల 230మందిని సకాలంలో ఆస్పత్రికి చేర్చగలిగింది. అలాగే నిరుపేదలైన 100 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున మొత్తంగా రూ.10 లక్షల వరకు ఆర్థికసాయం అందించి వారికి అండగా నిలిచింది. ఇలా ఈ కరోనా కష్ట కాలంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌, ‌సేవాభారతి ఎంతో మందికి అండగా నిలిచింది.

దేశవ్యాప్తంగా

దేశవ్యాప్తంగా 3800 ప్రదేశాలలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌స్వయం సేవకులు హెల్ప్‌లైన్‌ ‌కేంద్రాలను నిర్వహించారు.22 వేలకు పైగా స్వయంసేవకులు టీకా శిబిరాలను నిర్వహించ డంలో సహాయం అందించారు.7500కి పైగా ప్రదేశాలలో టీకా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌, ‌సేవా భారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 287 ప్రదేశాలలో ఐసోలేషన్‌ ‌కేంద్రాలు నడుస్తున్నాయి. అందులో సుమారు 9800 పడకలు ఉన్నాయి. వీటితోపాటు 118 నగరాల్లో కూడా కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లను నిర్వహించారు.7476 పడకలు ఉండగా అందులో 2285 పడకలు ఆక్సిజన్‌ ‌సదుపాయంతో ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 5100 మందికి పైగా స్వయం సేవకులు పనిచేశారు. ఇవి కాకుండా ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లలో కూడా స్వయంసేవకులు తమ వంతు సహయాన్ని అందించారు. దేశంలోని 762 నగరాల్లో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న 819 కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లలో 6000 మందికి పైగా స్వయం సేవకులు తమ సహకారాన్ని అందించారు. 1256 ప్రదేశాలలో రక్తదాన శిబిరాలను నిర్వహించి 44 వేల యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మెడికల్‌ ‌హెల్ప్‌లైన్ల ద్వారా 1.5 లక్షలకు పైగా ప్రజలు వైద్య సలహాలు పొందారు. ఈ కేంద్రాల్లో 4445 మంది వైద్యులు తమ సేవలను అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *