ఆలయాలను రక్షించుకోవాలి : గణపతి సచ్చిదానంద
దేశంలో ప్రతి ఆలయం గొప్ప గొప్ప దాతలు కట్టించారని, అలాంటి ఆలయాలను రక్షించుకోవాలని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. హిందూ సంస్కృతికి 5120 సంవత్సరాలు. హిందూరాష్ట్రం దేవలోకం అని విదేశీయులే చెబుతుంటారన్నారు. స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్ తో దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మొదటగా విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్ ఆదివారం హైందవ శంఖారావం నిర్వహించింది.ఎన్నో పుణ్యనదులు, పర్వతాలు. దేవుడే అవతారాలు దాల్చడానికి ఈ భూమిని ఎంచుకున్నాడు. ఇక్కడ పుట్టడం మన అదృష్టమని అన్నారు.
హైందవ ధర్మం ఇచ్చిన ఈ పిలుపు దిగంతాలకు చేరాలని, మన ప్రార్థన పరమాత్ముడికి చేరాలని ఆకాంక్షించారు.ఒక్క నినాదం శక్తి ఆ ప్రాంతంలో దశాబ్దాల పాటు నిలిచి ఉంటుందని ప్రకటించారు. మన ధర్మాన్న మనమే పాలించుకోవాలని, మన ఆకాంక్షలను దత్తాత్రేయుడు నెరవేర్చుగాక అంటూ ఆశీర్వాదాలు అందించారు.