ఆహార వ్యర్థాలతో నిర్మాణాలు పటిష్ఠం… ఐఐటీ పరిశోధన
మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను మనం పాడేస్తుంటాం. పండ్లు, కూరగాయలు కూడా కుళ్లినవి పాడేస్తుంటాం. కానీ… అవి కూడా పనికొస్తాయని రుజువైంది. హానికరం కాని బ్యాక్టీరియాతో కూడిన ఆ వ్యవర్థాలను కాంక్రీటులో కలపడం ద్వారా నిర్మాణాలు మరింత పటిష్టం అవుతాయని పరిశోధనలో తేలింది. ఐఐటటీ ఇండోర్ పరిశోధనలో ఇది రుజువైంది. దీనివల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని కూడా ఈ పరిశోధన బృందం తేల్చింది.
పండ్లు, కూరగాయల వ్యర్థాలు కుళ్లిపోయినప్పుడు CO2 విడుదలైంది. అయితే.. హానికర బ్యాక్టీరియా లేని వ్యర్థాలను కాంక్రీటులో కలిపినప్పుడు దానిలోని కాల్షియం అయాన్ లతో కార్బన్ డై యాక్సైడ్ చర్య జరుపుతుంది. ఫలితంగా కార్బొనైట్ స్ఫటికాలు ఏర్పడతాయి. అవి కాంక్రీట్ లో వున్న రంధ్రాలు, పగుళ్లల్లో చేరతాయి. దీంతో నిర్మాణం మరింత బలంగా మారుతుందని ఐఐటీ ఇందోర్ బృందం తేల్చింది.
క్యాలీఫ్లవర్లు, ఆలుగడ్డ తొక్కలు, మెంతికూర, నారింజ తొక్కలు, కుళ్లిన బొప్పాయి వంటి వ్యర్థాలతో హానికరం కాని బ్యాక్టీరియాను కాంక్రీటులో కలిపి పరిశీలించామని, రంధ్రాలు పూడ్చిన అనంతరం ఆ బ్యాక్టీరియా పెరగడం ఆగిపోతుందని, తద్వారా నిర్మాణానికి ఎలాంటి హాని వుండదన్నారు.