ఇడ్లీ వాడకంలో ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించిన కర్నాటక
కర్నాటక ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధం విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇడ్లీ చేసే హోటళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. ఇడ్లీ తినడం ద్వారా ఆరోగ్యం అని అటుంచితే.. ఇడ్లీ పార్శిళ్లలో వాడే ప్లాస్టిక్ వల్ల కాన్సర్ ప్రభావం పెరుగుతోందని గ్రహించారు. అందుకే ఇడ్లీ పార్శిళ్లకు ప్లాస్టిక్ వాడాకాన్ని నిషేధించారు. ఇడ్లీ పార్శిళ్ళకు ఎటువంటి ప్లాస్టిక్ పేపర్‌లను వాడరాదని రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖా పేర్కొంది.
ఇకపై ఇడ్లీలను గుడ్డలు ఉపయోగించి మాత్రమే తయారు చేయాలని సూచించింది. వేడి ఇడ్లీని ప్లాస్టిక్ పేపర్ ద్వారా పార్శిల్ చేయడం ద్వారా క్యాన్సర్(Cancer)ను ప్రేరేపించే రసాయనాలు ఉన్నాయని తేలిందన్నారు. ఇటీవల నగర వ్యాప్తంగా బెంగళూరు మహానగర పాలికె(Bangalore Metropolitan Municipality) ఆహార సంరక్షణా విభాగం అధికారులు దాడులు జరిపారు.
500 ఇడ్లీలను సేకరించగా వీటిలో 35 ఇడ్లీలు అత్యంత ప్రమాదకరమని నిర్ధారించారన్నారు. ప్లాస్టిక్ పేపర్ ఉపయోగించి ఇడ్లీ తయారు చేసినా, వేడి ఇడ్లీ పార్శిల్ చేసినా ప్రమాదకరమనే అంశాన్ని శాస్త్రవేత్తలు వివరించిన మేరకు వైద్య ఆరోగ్యశాఖ తీసుకునన్న నిర్ణయాలకు కట్టుబడాలని స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఇడ్లీల తయారీలో కానీ పార్శిల్‌కు కానీ ప్లాస్టిక్ పేపర్‌లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.