ఇస్లామిక్ ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేస్తున్న భద్రతా దళాలు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా బలగాలు యాక్షన్ లోకి దిగుతున్నాయి.ఓ వైపు ఇస్లామిక్ ఉగ్రవాదులను పట్టుకునేందుకు వ్యూహం వేస్తూనే.. మరోవైపు ఉగ్రవాదులు, అనుమానితుల ఇళ్లను ధ్వంసం చేసేస్తున్నాయి. తాజాగా భారత్ భద్రతా బలగాలు మరో ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేశాయి. కుప్వారా, కలరూస్ ప్రాంతంలో వున్న ఫరూక్ అహ్మద్ తద్వా, బందిపోరాలోని జమీల్ అహ్మద్ షీర్, అమీర్ నాజిర్ అనే ఇస్లామిక్ ఉగ్రవాదుల ఇళ్లను కాల్చి పారేశాయి.

అలాగే బిజ్ బెహరాలోని ఆదిల్ గోజరి, త్రాల్ ప్రాంతంలోని ఆసిఫ్ షేక్, పుల్వామాలోని ఎహసాన్ షేక్, సోఫియాలోని షాహిద్ అహ్మద్, కుల్గాంలోని అహ్మద్ గనియా, పుల్వామాలోని హారిస్ అహ్మద్ తో పాటు బిజ్‌బహారాలోని అదిల్ హుస్సేన్ థోకర్ ఇంటిని ఐఈడీలతో పేల్చి వేయగా, ఆసిఫ్ షేక్ ఇంటికి బుల్‌డోజర్‌లతో కూల్చి వేశాయి.

ఇప్పటి వరకు ఐదుగురు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేశామని, మిగిలిన వారిపై కూడా ఇలాంటి యాక్షనే వుంటుందని భారత భద్రతా బలగాలు ప్రకటించాయి. వీటితో పాటు శ్రీనగర్ లోని 60 కి పైగా ప్రదేశాల్లో ఉగ్ర స్థావరాలను గుర్తించడానికి దాడులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు నెలవైన ఇళ్లల్లో పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసేసుకుంటున్నాయి. దేశంలో దేశ వ్యతరేక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే ఏ ఒక్కర్నీ వదిలిపెట్టమని, ఉపేక్షించేదే లేదని తేల్చి చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల జాడ చెప్పిన వారికి రూ.20 లక్షల నజరానాను పోలీసులు ప్రకటించారు. ఈ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టుల రేఖా చిత్రాలను కూడా విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *