ఈ నెల 24 న పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను ఈ నెల 24న కేంద్రం విడుదల చేయనుంది. ఫిబ్రవరి 2025, చివరి వారంలోనే 19వ విడత పెట్టుబడి సాయం విడుదల చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24వ తేదీన బిహార్‌లో పర్యటిస్తారు. వివిధ వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు.. పలు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లోకి రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేయనున్నారు.18వ విడత నిధులు అక్టోబర్ 15, 2024న ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు రూ.6 వేలు పెట్టుబడి సాయం ఇచ్చారు. మూడు విడతల్లో 2 వేల చొప్పున డబ్బులు జమ చేస్తున్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *