ఈ నెల 3 న లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదిక

వక్ఫ్ సవరణ బిల్లుపై  జేపీసీ నివేదికను ఫిబ్రవరి 3న ఉభయ సభలలో సమర్పించనున్నారు. జేపీసీ నివేదిక 16 ఓట్ల మెజారిటీతో ఆమోదించబడింది. అనుకూలంగా 16 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై 2024 ఆగస్టు 8న జేపీసీని ఏర్పాటు చేశారు. జేపీసీ సభ్యులు వక్ఫ్ (సవరణ) బిల్లుపై దాదాపు 17 నెలల పాటు చర్చించారు.

జనవరి 29న, 655 పేజీల JPC నివేదికను మెజారిటీ సభ్యులు ఆమోదించారు. ఇందులో బీజేపీ సభ్యులు ఇచ్చిన సూచనలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలు సూచించిన సవరణలు తిరస్కరించబడ్డాయి. అంతకుముందు JPC సమావేశంలో, ముసాయిదా బిల్లు, సవరణలను మెజారిటీ సభ్యులు ఆమోదించారు. JPC సభ్యుల మధ్య ఓటింగ్ జరిగింది. సవరించిన బిల్లుకు అనుకూలంగా 16 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *