ఉగ్రవాదుల చిత్రాలను విడుదల చేసిన నిఘా వర్గాలు
పహల్గాం దాడిలో పాల్గొన్న ఇస్లామిక్ ఉగ్రవాదుల ఊహా చిత్రాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఊహా చిత్రాలను అధికారులు విడుదల చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులుగా భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ ఇప్పటికే లష్కరే తోయిబా ప్రకటించింది. ఆ సంస్థ టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్ ఈ ఘటనకు ప్రధాన సూత్రదారి అని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.అలాగే రావల్ కోట్‌లోని ఇద్దరు వ్యక్తులతో ఈ ఘటనకు ప్రమేయం ఉందని వెల్లడించాయి. ఆ దిశగా నిఘా వర్గాలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి. తొలుత నిఘా వర్గాలు ఊహా చిత్రాలను విడుదల చేశాయి. ఆ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఈ దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను విడుదల చేశారు.