ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్

ఇస్లామిక్ ఉగ్రవాద బాధిత కుటుంబాలకు సహాయం చేసే విషయంలో అక్కడి పరిపాలనా విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి పరిపాలనా విభాగం అతి త్వరలోనే ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రకటించనుంది. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. మూడు దశాబ్దాలకు పైగా జరిగిన సంఘర్షణలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు తాజాగా 80 మందికి పైగా బాధిత కుటుంబాలతో మనోజ్ సిన్హా సంభాషించారు .వారి బాధలు తెలుసుకున్నారు. ఈ ఘటన తర్వాతే టోల్ ఫ్రీ నెంబర్ తేవాలని గవర్నర్ నిర్ణయించారు.
ఉగ్రవాదుల చేతిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఎల్జీ మనోజ్ సిన్హా అధికారులను ఆదేశించారు. అలాగే ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులు చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ఉగ్రవాద బాధిత కుటుంబాల ఆస్తులను కూడా వెంటనే విడిపించాలని, వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఎల్జీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే వ్యక్తులను గుర్తించాలని, కొందరు ఇప్పటికీ ప్రభుత్వ విభాగాలల్లో పనిచేస్తున్నారన్నారు.ఉగ్రవాద బాధిత కుటుంబాల ఆందోళనలను ప్రత్యేకంగా పరిష్కరించడానికి LG సెక్రటేరియట్‌లో ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో కూడా ఇలాంటి సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు.
‘‘ఉగ్రవాద బాధిత కుటుంబాలకు సాధ్యమైన ప్రతి సహాయమూ అందిస్తాం. తప్పు చేసి, బయట స్వేచ్ఛగా తిరుగుతున్న దోషులకు శిక్షపడేలా చూస్తాం.’’ అని ఎల్జీ ప్రకటించారు.మరోవైపు ఉగ్రవాద బాధిత కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టం అయ్యేలా చూస్తామని, ముద్రా పథకం కింద ఆర్థిక సమాయంతో పాటు స్వయం ఉపాధి వెంచర్లను కూడా అందేలా చూస్తామన్నారు.ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను సంబంధిత డిప్యూటీ కమిషనర్లకు సమర్పించాలని, నియామక ప్రక్రియ ఒక నెలలోపు పూర్తవుతుందని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *