ఉత్సాహంగా గిరిజన చిత్రలేఖనం పోటీలు.. పాల్గొన్న 250 మంది విద్యార్థులు
గిరిజన స్వాభిమాన ఉత్సవాలు 2025 రుషికొండలో జరిగాయి. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ కార్యాలయంలో గాయత్రీ విద్యా పరిషత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆడిటోరియంలో జరిగాయి. ఇందులో చరిత్ర లేఖన పోటీలు జరిగాయి. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో జరిగిన ఈ పోటీల్లో ఎనిమిది ఐటీడీఏ పరిధిలోని 17 జిల్లాల నుంచి 250 మంది విద్యార్థులు, కళాకారులు పాల్గొన్నారు.వీరు వేసిన చిత్రాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆంధ్రా యూనివర్శిటీ అధ్యాపకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
నెల్లూరు ఐటీడీఏకు చెందిన సీహెచ్ మణి విజేతగా నిలవగా, పాడేరు ఐటీడీఏకు చెందిన బి.నందిని, ఆర్.రాజేష్‌లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అనంతరం విజేతలకు ఈడీ బహుమతులు ప్రదానం చేశారు. గాయత్రి కళాశాల ప్రొఫెసర్ పి.వి.శర్మ, టీసీఆర్‌టీఎం సభ్యులు పాల్గొన్నారు.