ఎండా కాలంలో పశువుల జాగ్రత్త ఇలా…. అధిక దిగుబడి పొందడం ఇలా

వేసవి వచ్చేసింది. కేవలం మనుషులు మాత్రమే కాకుండా పశు పక్ష్యాదులు కూడా తీవ్రమైన తాపాన్ని ఎదుర్కొంటాయి. దీంతో ఈ సందర్భంగా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక్కో సారి వేడిని తట్టుకోలేక పశువులు ప్రాణాలు కోల్పోయిన సందర్భం కూడా వుంది. దీంతో రైతులు తీవ్ర మానసిక క్షోభతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోయారు. పాడి పశువులు అధికంగా వేడికి గురైతు పాల దిగుబడి తగ్గిపోతుంది. కావున పశువులు వేడి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు పలు ఉపాయాలున్నాయి.

1. పశువులను ఎప్పుడూ షెడ్డు కిందే కట్టేసి వుంచొద్దు. చుట్టూ గట్టి కంచె వున్న దొడ్డిలో గోడలు లేకుండా ఎత్తుగ నిర్మించిన షెడ్‌లో తిరగనివ్వాలి.
2. వడ గాడ్పులు బాగా వున్నప్పుడు తరుచూ నీటిని తుంపర్లుగా చల్లేందుకు పశువుల షెడ్డులో మైక్రో స్పింకర్లు లేదా మిస్టర్లను ఏర్పాటు చేసుకోవాలి.
3. ఇలా వీటుకానీ పక్షంలో తడిపిన గోనె సంచులను పశువు నడుముపై వేసి చల్లదనాన్ని కలిగించాలి. అది ఆరిపోకుండా చూసుకోవాలి.
4. అత్యధిక వేడి సమయంలో చెట్ల నీడన సేద తీరే అవకాశం కల్పించాలి. లేదా టెంట్లు వేస్తే మరీ మంచిది.
5. ఎక్కువ పశువులను అతి తక్కువ స్థలంలో వుంచొద్దు. వాటి శరీరంలో ఉష్ణం బాగా పెరుగుతుంది. దీంతో గాలి ప్రసరణ తగ్గి, పశువులు ఇబ్బందులు పడతాయి.
6. నిరంతరం స్వచ్ఛమైన నీటి సరఫరా పుష్కలంగా వుండేలా చూడాలి. పశువులు వేడి వాతావరణంలో ఎక్కువ నీరు తాగి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే అవకాశం కల్పించాలి.
7. పరిసరాలను చల్లగా వుంచడానికి స్ప్రింక్లర్లు వాడాలి. లేదంటే శరీరంపై నీటిని చల్లాలి.
8. చల్లగా వున్న సమయంలో దాణా, మేత ఇవ్వాలి. వేడి బాగా వున్న సమయంలో ఇస్తే, వాటి జీవ క్రియకు తోడ్పడేందుకు తగిన శక్తి, ప్రొటీన్‌, ఖనిజాలతో కూడిన సమతుల్య దాణాను అందించాలి. జంతువులపై ఒత్తిడి తగ్గించడానికి చల్లటి సమయంలోనే పాలు పితకాలి.
9.టెంపరేచర్‌ 68 దాటితే జాగ్రత్తపడాలి. 98 దాటితే మాత్రం ప్రమాదం.
10. వేడిని తట్టుకోగల జాతులను ఎంపిక చేసేకుంటే మరీ మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *