ఎవరైనా గోవులను అక్రమంగా రవాణా చేసినా, వధించినా చర్యలు తీసుకుంటాం :

జిల్లాలో ఎవరైనా గోవులను అక్రమంగా రవాణా చేసినా, వధించినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్  ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో  జిల్లా పోలీసు అధికారులు, పశువైద్యాధికారులు, వీహెచ్‌పీ నాయకులు, పశువుల వధశాల కటికే వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా గోవులను అక్రమంగా రవాణాను అడ్డుకునేందుకు తీసుకోవల్సిన చర్యలు, చట్టాలు, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేసే సమయంలో తీసుకోవల్సిన చర్యల గురించి పీపీటీ ద్వారా అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసు, పశు వైద్యాధికారులు సమన్వయంతో పనిచేసి, జిల్లాలో గోవుల అక్రమ రవాణా, గో వధను అరికట్టాలన్నారు.

కర్ణాటక నుంచి గోవులను అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా పరిధిలో జిలాల్‌పూర్‌, కృష్ణ బ్రిడ్జీల దగ్గర చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చెక్‌ పోస్టుల దగ్గర పోలీసులు, పశు వైద్యాధికారులు, ఆర్టీవో సిబ్బంది కలిసికట్టుగా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. కోస్గి, మద్దూర్‌లో గల సంతకు పశువుల రవాణాకు కావాల్సిన రవాణా పత్రాలు పరిశీలించి, అనుమతులు లేని వాటిపై కఠిన చర్యలు తీసుకుకోవాలన్నారు. పశువులు ఒక చోట నుంచి మరో చోటకు తరలిస్తే పశువైద్యాధికారి అనుమతి పత్రం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అక్రమ రవాణా విషయం తెలిస్తే పోలీసులు లేదా కంట్రోల్‌ రూమ్‌ 8712670399కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *