ఏబీవీపీ ఫిర్యాదుతో యూనివర్శిటీ క్రైస్తవ కార్యక్రమం రద్దు
ఏబీవీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో వివాదాస్పద క్రైస్తవ కార్యక్రమాన్ని మద్రాసు యూనివర్శిటీ రద్దు చేసుకుంది. ఈ మేరకు యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.‘‘క్రైస్తవ మతాన్ని ఎందుకు అనుసరించాలి?’’ అన్న పేరుతో ఈ నెల 14 న కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే.. ఈ యూనివర్శిటీ ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడుస్తోంది కాబట్టి, ఇలాంటి మత ప్రచార కార్యక్రమాలు రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 28 (3) ప్రకారం ప్రభుత్వ నిధులతో నడుస్తున్న విద్యా సంస్థల్లో మత ప్రచారం కానీ, మత కార్యక్రమాలు గానీ నిర్వహించరాదు.
దీంతో యూనివర్శిటీ నిర్వహిస్తున్న రాజ్యాంగ విరుద్ధ క్రైస్తవ కార్యక్రమంపై తమిళనాడు ఏబీవీపీ శాఖ రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలంటూ గవర్నర్ కార్యాలయం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ని ఆదేశించింది. దీంతో యూనివర్శిటీపై ఒత్తిడి పెరిగింది. దీంతో చివరగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రాచీన చరిత్ర పురావస్తు విభాగం ఇంచార్జీ సౌందర రాజన్ ఓ లేఖ ద్వారా రిజిస్ట్రార్ కి తెలిపారు.