ఐదేళ్లలో 610 కళాఖండాలు స్వాధీనం : భారత ప్రభుత్వం ప్రకటన

ఐదేళ్లలో ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, థాయిలాండ్‌, యూకే, యూఎస్ఏ నుంచి మొత్తం 610 భారతీయ కళాఖండాలను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు. సోమవారం, లోక్‌సభలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గోలింగేశ్వర ఆలయానికి చెందిన నంది శిల్పాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.

 

తాజాగా గతేడాది 2024 లో భారత్ నుంచి స్మగ్లర్లు అక్రమంగా తరలించిన 1,400 కి పైగా పురాతన కళాకృతులను అమెరికా తిరిగి అప్పగించింది. వీటి విలువ కోటి డాలర్లకు పైమాటే. దక్షిణ, ఆగ్నేసియా దేశాలకు చెందిన కళాకృతులను మాతృదేశాలకు స్వాధీనం చేసే చర్యల్లో భాగంగా ఇది జరిగింది. దేవ నర్తకి వంటి అపురూప కళాకృతులు కూడా ఇందులో వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *