ఐరాసలో ఇండోనేషియా అధ్యక్షుడు.. ‘‘ఓం శాంతి.. ఓం శాంతి’’ అంటూ ప్రసంగం

ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఐరాసలో చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన ప్రసంగంలో శాంతి, న్యాయం, సమానత్వం అన్న విషయాలపై ప్రసంగించారు. అంతేకాకుండా ఓం శాంతి… ఓం శాంతి.. అంటూ హిందూ మంత్రంతో తన ప్రసంగాన్ని ముగించారు.మొత్తం 19 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. ఈ 19 నిమిషాల్లో ప్రపంచ సంక్షోభాలు, యుద్ధాలు, మానవ విషాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భయం, జాత్యహంకారం, ద్వేషం మరియు వర్ణవివక్షతో నడిచే మానవ మూర్ఖత్వం మన భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్రపంచం మొత్తం కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గాజా మరియు పాలస్తీనా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అమాయక ప్రజలు సహాయం కోసం ఏడుస్తున్నారని, ప్రపంచం ఇప్పటికీ నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోతే, అది అంతులేని యుద్ధాలకు దారితీస్తుందని అన్నారు.శాంతిని నెలకొల్పడానికి గాజా లేదా ఇతర పాలస్తీనా భూభాగాలకు 20,000 లేదా అంతకంటే ఎక్కువ మంది సైనికులను పంపడానికి ఇండోనేషియా సిద్ధంగా ఉందని ప్రకటించారు.ఏ సంఘర్షణకైనా పరిష్కారం హింస కాదని, సంభాషణ మరియు పరస్పర అవగాహన అని కూడా ఆయన అన్నారు. “ఓం శాంతి శాంతి శాంతి ఓం” అని చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని శాంతి సందేశంతో ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *