ఒకే ఒక ఆలోచన..బీడు భూముల్లోనూ లక్షల పంట పండించారు….

అయ్యో వర్షాలు పడటం లేదని అక్కడి రైతులు కుంగిపోలేదు. ఏమి చెయ్యాలో తోచక అల్లాగే ఉండిపోలేదు. బీడు భూముల్లో పంటలు పండించాలని కృత నిశ్చయంతో ముందగుడు వేసి బంపర్ విజయం సంధించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.బీడు భూముల్లో బోర్లు వేసుకున్నారు. సాంప్రదాయ పంటలఫై ద్రుష్టి ససాధించారు. అనుకున్న దాని కంటే అధిక పంట దిగుబడి తెచుకున్నారు నారాయణ ఖేడ్ రైతులు. వారి సక్సెస్ స్టొరీ ఇది.

తమ బీడు భూముల్లో బోర్లు వేసుకున్నారు. అంటే.ఆరుతడి పంటల సాగుచేస్తున్నారు. వీరిలో అధికంగా జొన్న పంట వైపు మల్లారు. సంగారెడ్డి దారిలో వెళ్ళే పంట పోల్లల్లో ఇది బాగా కనిపిస్తోంది. యాసంగి లో వ్యవసాయ అధికారుల అంచనాలకు మించి రైతులు జొన్న పంట పండించారు. దీంతో అధికారులు రైతులను మెచ్చుకుంటున్నారు. వారు చేసిందల్ల బీడు భూముల్లో బోర్లు వేయించుకొని ఆరుతడి పంటల వైపు రావడమే.

నారాయణ ఖేడ్ లో ఈసారి వర్షాలు తగినంతగా పడలేదు. దీంతో భూగర్భ జలాలు బాగా తగ్గిపోయాయి. దీంతో రైతులంత సమావేశం అయ్యారు. తక్కువ నీటితో అధిక పంటలు పండే వైపు మళ్ళాలనిఅనుకున్నారు. ఆరుతడి పంటలు పండించారు. వారి పంటకు ఎక్కువ నీరు అవసరం అవుతుంది కాబట్టి జొన్న పంట వైపు మళ్ళారు. మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతోంది. దాదాపుగా జిల్లాలో 29 వేల ఎకరాల్లో జొన్న సాగు అవుతుందని అధికారులు అనుకుంటే ఏకంగా 56 వేలకు పైగా హెక్టార్ లలో ఎకరాల్లో జొన్న పండింది . అయితే నారాయణ ఖేడ్ లోని కల్హేర్ మండలంలో ఎకరాల్లో జొన్న సాగు అయ్యింది.అయితే.. ఇది మంచి పరిణామం అని వ్యవసాయ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *