ఒక్క డ్రమ్ముతో ”వాటర్ మ్యాన్” అయ్యాడు…. నీటిని సంరక్షిస్తున్నాడు..
ఇప్పుడు నడుస్తోంది కరువు కాలం. బెంగుళూరులో ఐతే… కటకటమే. గ్రామాలల్లో పరిస్థితి చెప్పాల్సిన పనే లేదు. ఐతే… ముంబై లో పరిస్థితి మరోలా వుంది. నీటిని నిల్వ చేయడంలో ప్రజలు విఫలం అవుతున్నారు. వర్షాలు బాగా కురుస్తున్నా… నీటిని నిల్వ చేయడంలో మాత్రం కుదరడం లేదు. దీంతో నీరు దొరకడం లేదు. ఈ పరిస్థితిని చూసి ఓ వ్యక్తి చలించిపోయాడు. అతి తక్కువ ఖర్చు తో ఇంట్లోనే వర్షపు నీటిని సంరక్షిచాలని డిసైడ్ అయ్యాడు ఆయన పేరు సుభజిత్ ముఖర్జీ. ఐఐటీ బొంబాయి నుండి ఇంజినీరింగ్ పట్టాను పొందారు. కేవలం ఒక ప్లాస్టిక్ డ్రమ్ము, పీవీసీ పైప్ సాయం తో భూగర్భ జలాలను కాపాడుతున్నారు. బొంబాయి నగరం లోని పార్కులు, స్కూల్స్ లో, హౌసింగ్ సొసైటీలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ పేరుతొ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా కొన్ని రోజులుగా చేస్తున్నారు. అంతే కాకుండా గ్రీన్ బొంబాయి పేరిట ఒక ఎన్జీవోను కూడా ఏర్పాటు చేసారు. ఈ ఎన్జీవోలో స్కూల్ పిల్లలు కూడా వున్నారు. కేవలం 25,౦౦౦ ఖర్చుతో రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
ఎలా తాయారు చేస్తున్నారంటే…
1. ప్లాస్టిక్ ద్రంములను తీసుకోవాలి. ఫైనుండి కింది వరకూ రంధ్రాలను చెయ్యాలి.
2. తర్వాత మన ఇంటి పరిసరాల్లో 3×3 లేదా 5×5 అడుగుల గోయ్యిని తవ్వాలి. అందులో రంధ్రాలు చేసిన డ్రమ్ములను ఉంచాలి.ఆ డ్రమ్ము ఫై భాగంలో రంధ్రం చేసి అందులో పీవీసీ పైపులను ఉంచాలి. మరోవైపు ఇంటిఫై నుంచి వాన నీరు ఫైపులోకి వచ్చేలా కనెక్షన్ ఇవ్వాలి.
౩. తర్వాత గుంతలో వున్నా డ్రమ్ము ఫైభాగం వరకు కంకర రాళ్ళు లేదా ఇతర రాళ్ళతో నింపాలి.వర్షం పడిన ప్రతి సారి ఫైపు నుండి నీరు డ్రమ్ము వున్నా గుంతలోకి చేరుతుంది. దాంతోపాటు చుట్టుపక్కల వాన నీరు కూడా అందులోకి చేరి, పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని సుభజిత్ చెబుతున్నాడు.
4. ఇవే కాకుండా భూమిలో పది రోజుల పాటు నీటిని నిల్వ చేసే విధానాన్ని కూడా అభివృద్ధి చేసాడు. వీటిని తాగడానికి పనికిరావు. దీని ఏర్పాటుకు 5,000 వరకు ఖర్చు అవుతుంది.