కన్వర్ యాత్ర చేస్తూ ప్రేరణ నింపిన ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు, ఆచార్యులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్ (IIT-K) విద్యార్థులు కన్వర్ యాత్ర చేశారు. పర్మత్‌లోని పూజ్యమైన ఆనందేశ్వర్ మందిర్‌లో జలాభిషేకం చేయడానికి గంగా నది నుండి పవిత్ర జలాన్ని తీసుకుని 2.5 కిలోమీటర్ల కన్వర్ యాత్రను చేపట్టారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక పునాదులను మరింత పటిష్టం చేయడానికి ఈ యాత్రను చేపట్టారు.
సంప్రదాయ దుస్తులను ధరించి, ఈ ఇంజినీరింగ్ విద్యార్థులు, ఐఐటీ బోధించే ఉపాధ్యాయులు కూడా ఇందులో పాల్గొన్నారు. దాదాపు 50 మంది కాషాయ దుస్తులు ధరించి, చెప్పులు లేకుండా హర హర మహాదేవ్, బంబం భోలే అంటూ నినాదాలు చేస్తూ ఈ యాత్ర చేశారు. ఈ సందర్భంగా సిద్ధనాథ్ మందిర్ మహంత్ వీరందర్నీ ఆశీర్వదించి, యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరందర్నీ ఆయన ప్రశంసించారు. ‘‘”మన యువత సైన్స్ మరియు ఆవిష్కరణలలో మాత్రమే కాకుండా మన ధర్మాన్ని నిలబెట్టడంలో మరియు జీవించడంలో కూడా నాయకత్వం వహిస్తున్న భారతదేశం ఇదే” అని పేర్కొన్నారు.
ఈ ఐఐటీ విద్యార్థులు వీధుల గుండా నడుస్తున్న సమయంలో స్థానికులు కూడా ఎంతో ఉత్సాహంగా నినాదాలిచ్చారు. ఈ కన్వర్ యాత్రలో పాల్గొన్న ఐఐటీ విద్యార్థులకు మంచి నీళ్లు, స్వీట్లు ఇచ్చి, ప్రోత్సహించారు.ఆనందేశ్వర్ మందిరానికి చేరుకున్న తరువాత, పాల్గొనేవారు అందరు భక్తుల మాదిరిగానే క్యూలో నిలబడి, ఓపికగా వేచి ఉండి, వేద సంప్రదాయం ప్రకారం శివలింగంపై పవిత్ర గంగాజలాన్ని పోస్తూ, భగవాన్ శివుని జలాభిషేకం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *