కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు. ప్రయాగ్ రాజ్ చేరుకున్న తర్వాత సీఎం యోగితో కలిసి త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు. తదనంతరం పుణ్యస్నానమాచరించారు. సందర్భంగా తాజాగా సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆపై పవిత్ర స్నానం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. దీనికి ముందు ప్రధాని మోదీ గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమ స్థలానికి చేరుకోవడానికి సీఎం యోగితో కలిసి పడవలో సంగం ఘాట్‌కు చేరుకున్నారు.