క్రైస్తవులారా… ముందు భారతీయ క్రైస్తవులు కండి!

“సర్వధర్మ సమభావన” విరాజిల్లిన ఈ పుణ్యభూమిపై నిలబడి, మన మూలాలను మర్చిపోవడం ఎంతవరకు ధర్మం? క్రైస్తవం అంటే కేవలం ఒక మతం కాదు, చరిత్ర పుటల్లో అది ఒక సామ్రాజ్యవాద దాహం. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెలిగిన ఎన్నో స్థానిక సంస్కృతులను, ప్రాచీన మతాలను క్రైస్తవం కబళించివేయలేదా? అమెరికా గడ్డపై రెడ్ ఇండియన్ల పట్ల జరిగిన అరాచకాలు, ఆస్ట్రేలియా ఆదివాసుల అణచివేత.. చరిత్ర ఈ రక్తపు మరకలను ఎప్పటికీ మర్చిపోదు.
అసమానతల ముసుగులో సోదరభావం?
​”మేము సోదరభావానికి మారుపేరు” అని చెప్పుకునే వారు ఒక్కసారి గతాన్ని తరచి చూసుకోవాలి.
​వర్ణ వివక్ష: ఐరోపా దేశాల్లో తెల్లవారికో నీతి, నల్లవారికో నీతి అన్నట్లుగా జరిగిన అమానవీయ ఘర్షణలు సోదరభావమేనా?
​మంత్రగత్తెల వేట: 15వ శతాబ్దంలో ‘మంత్రగత్తెలు’ అనే ముద్రవేసి వేలమంది అమాయక మహిళలను సజీవ దహనం చేసిన క్రూరత్వం మీది కాదా?
​గోవా మారణహోమం: మన దేశంలోనే, గోవా గడ్డపై మత ప్రచారం ముసుగులో సాగించిన అత్యాచారాలు, మారణకాండ భారతీయుల గుండెల్లో పసిగా మారలేదా?
​భారతీయత అంటే గౌరవం!
​గతం గతః అనుకుందాం. కానీ వర్తమానంలోనైనా మార్పు అవసరం. చర్చికి వెళ్లండి, క్రీస్తును ఆరాధించండి.. దానికి ఏ హిందువు అభ్యంతరం చెప్పడు. కానీ, ఈ మట్టి గడ్డపై పుట్టి, ఇక్కడి నీరు తాగి, ఇక్కడి దేవతలను “సైతానులు” అని దూషించడం ఏ రకమైన సంస్కారం?
​”ఏకం సత్ విప్రా బహుధా వదంతి”  (సత్యం ఒక్కటే, కానీ జ్ఞానులు దానిని అనేక పేర్లతో పిలుస్తారు)
​ఒకే దేవుడు.. అనేక రూపాలు, అనేక మార్గాలు. ఇదే ఈ భారతావని ఆలోచనా తీరు. ఇదే ప్రపంచ శాంతికి ఏకైక మూలాధారం.
అన్య మతాలను ద్వేషించడం మానుకోండి. ఇతర దైవాలను గౌరవించడం నేర్చుకోండి. మీ మతం ఐరోపాది కావచ్చు, కానీ మీ రక్తం భారతీయం కావాలి. మతం కంటే దేశం మిన్న అని చాటిచెప్పే “భారతీయ క్రైస్తవులుగా” మారండి. అప్పుడే ఈ గడ్డపై శాంతి పరిమళిస్తుంది.
– శ్యాం ప్రసాద్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *