క్రైస్తవ ఒత్తిడికి ఏపీ ప్రభుత్వం తలవంచుతోందా?

రాష్ట్రంలోని చేపట్టనున్న ఇంటింటి సర్వే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. సర్వేలో భాగంగా పౌరుల వివరాలతో పాటు వారి మతం అనే సూచిక వద్ద ‘షెడ్యూల్డ్ తెగ’ అనే ఆప్షన్ చేర్చడం ఈ వివాదానికి కారణమవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టదలచిన ఇంటింటి సర్వే కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ మతాలతో పాటు 10వ ఆప్షన్ గా ‘గిరిజన మతం’ అనే ఆప్షన్ చేర్చారు. దీని ద్వారా గిరిజనులను ప్రత్యేక మతస్థులుగా గుర్తిస్తూ ఇంటింటి సర్వే సాఫ్త్వేర్ రూపకల్పన జరిగింది.

ఇప్ప‌టి వ‌ర‌కు భారత రాజ్యాంగంలోనూ లేదా దేశంలో రూపొందించి అమలుచేస్తున్న ఏ చట్టములోనూ షెడ్యూల్డ్ తెగలను ప్రత్యేక మతంగా పేర్కొనలేదు. దేశంలోని షెడ్యూల్ తెగ‌లకు చెందిన ప్రజలందరూ ఆదినుండీ హిందూధర్మంలో అంతర్భాగంగానే ఉంటూ, త‌మ ఆచార వ్య‌వ‌హారాలు పాటిస్తూ పాటిస్తూ వస్తున్నారు.

అయితే  దేశవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్డ్ తెగలకు చెందిన పౌరులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి గత 100 సంవత్సరాలుగా క్రైస్తవ మిషనరీ సంస్థలు విప‌రీత‌మైన ప్రయత్నాలు చేస్తున్నాయి. షెడ్యూల్ తెగ‌లు ఎక్కువ‌గా ఉండే ఈశాన్య రాష్ట్రాలతో పాటు జార్ఖండ్ వంటి రాష్ట్రంలో షెడ్యూల్ తెగ‌ల‌ ప్రజలను క్రైస్త‌వ మ‌తంలోకి మార్చేందుకు అనేక కుట్ర‌లు జరుగుతున్నాయి. దేశంలో హిందూ, బౌద్ద మ‌తాల్లో ఉన్న షెడ్యూల్ తెగ‌ల ప్ర‌జ‌ల‌ను గిరిజన మతాన్ని ప్రకటించి త‌ర్వాత వారిని షెడ్యూల్డ్ తెగలను అధికారికంగా దూరం చేసి ఎస్టీ క్రిస్టియ‌న్లుగా మార్చేందుకు క్రైస్తవ మిషనరీ సంస్థలు పెద్ద ఎత్తున కుట్ర‌లు చేస్తున్నాయి

ఈక్రమంలో ఇటీవల జార్కండ్ రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2020 నవంబర్ 11న జార్ఖండ్ అసెంబ్లీ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్ర గిరిజన ప్రజలకు ప్రత్యేక మతపరమైన గుర్తింపునిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది. ఆ గుర్తింపును ‘సర్నా కోడ్’గా వ్యవహరిస్తారు.

2021 జ‌నాభా లెక్క‌ల కోసం రాష్ట్రంలో ఎక్కువ‌గా ఉండే ‘సర్నా’ షెడ్యూల్డ్ తెగ‌ల కోసం స‌ర్నా మతం కేటాయించే విధంగా  ప్రత్యేక కాలమ్‌ను సృష్టించ‌డ‌మే ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశ్యం.

ఇదే త‌ర‌హాలో ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ఇంటింటి స‌ర్వేలో షెడ్యూల్ తెగ‌లను మ‌తం అనే కాలమ్ లో  ప్ర‌త్యేకంగా  చేర్చారు. గత రెండు దశాబ్దాల్లో క్రైస్తవ మిషనరీలు తమ ఒత్తిడి ద్వారా  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గణనీయమైన సంఖ్యలో క్రైస్తవ మత మార్పిళ్ల‌కు పాల్పడ్డారు. ఇప్పుడు క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో తమ ఎజెండా నెరవేర్చుకునే విషయంలో మరింత పట్టుదలగా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *