క్రైస్తవ పాస్టర్ కర్ణం ధమన్ కుమార్ పై లైంగిక వేధింపుల కేసు

నల్గొండకి సంబంధించిన క్రైస్తవ పాస్టర్ బిషప్ కర్ణం ధమన్ కుమార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.జర్మనీలోని మున్‌స్టర్‌ నగరంలో పాస్టర్ గా వున్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2005 నుంచి 2007 మధ్య ఈ ఘటన జరిగినట్లు ఈ యేడాది మార్చి మాసంలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో బిషప్ కర్ణం ధమన్ కుమార్ ను పాస్టర్ బాధ్యతల నుంచి తొలగించారు. దీనికి సంబంధించి మున్ స్టర్ బిషప్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి ది న్యూస్‌ మినిట్‌ వెబ్‌సైట్‌ ఓ కథనం ప్రచురించింది.
ఈ యేడాది ఏప్రిల్ మాసంలో పారిస్ కి వెళ్లాడు. అయితే గతంలో పాస్టర్ గా అక్కడి ప్రాంతంలోనే పనిచేశాడు. అయితే లైంగిక వేధింపుల కేసు బయటికి రావడంతో పాస్టర్ బాధ్యతల నుంచి ఆయన్ను తొలగించారు.ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ధమన్‌కుమార్‌.. 2001 నుంచి 2012 వరకు మున్‌స్టర్‌ నగరంలో మత గురువుగా పనిచేశారు. తర్వాత 2017లో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో క్రైస్తవ మతబోధకుడిగా ప్రచారం చేశారు. తిరిగి 2017 నుంచి 2020 వరకు మున్‌స్టర్‌ నగరంలో, తర్వాత ఆ దేశంలోనే ఓల్డెన్‌బర్గ్‌ బార్తోలోమస్‌ చర్చిలో ఫాదర్‌గా పనిచేశారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ 2024 ఏప్రిల్‌లో ధమన్‌కుమార్‌ను నల్లగొండ బిష్‌పగా నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *