గోమయంతో చేసిన సబ్బు వాడి… కరోనా నుండి రక్షణ పొందిన ఉదంతం ఇదీ…
కోవిడ్ చాలా మందిని దెబ్బతీసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… మరణించిన వారూ వున్నారు. కాస్త మెళ్లిగా కోలుకొని, సైడ్ ఎఫెక్టతో బాధపడుతున్నవారూ వున్నారు. కానీ మహారాష్ట్ర గోసేవా కమిషన్ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మాత్రం కోవిడ్ సమయంలో చాలా తిరిగినా… వారికి ఏమీ కాలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెళ్లడిరచాడు కూడా. ‘‘కోవిడ్ సమయంలోనూ చాలా తిరిగాను. గత 32 సంవత్సరాలుగా నేను గోపేడతో తయారు చేసిన సబ్బునే వాడుతున్నాను. మామూలు సబ్బుల లాగే ఇది కూడా వుంటుంది. గోసబ్బు వాడుతూ కోవిడ్ సమయంలో చాలా పర్యటించాను. అధ్యక్షుడి హోదాలో బాగా తిరిగాను. కానీ.. ఏమీ కాలేదు. ఎలాంటి చర్మ వ్యాధులు కూడా రాలేదు. హాయిగా వున్నాను’’ అని ప్రకటించారు.
ఇప్పటికీ చాలా మటుకు తాను గోఉత్పాదకతలనే వాడుతానని, ఆరోగ్యంగా వున్నాని తెలిపారు. జర్మనీ లాంటి దేశాల్లో గాలిని శుభ్రం చేసుకోవడానికి గోమయంతో చేసిన పిడకలను వెలిగించి, శుభ్రం చేసుకుంటారని తెలిపారు. ఇక.. గోమూత్రం ద్వారా కేన్సర్ నయం అవుతుందని, శాస్త్రవేత్తలు కూడా దీనిని రూఢీ చేశారన్నారు. ఆవు పేడ డిమాండ్ కూడా బాగా పెరిగిందని, దానిని కాల్చడం వల్ల పర్యావరణ ప్రయోజనాలు ఇమిడి వున్నాయని చాలా దేశాలకు తెలిసిపోయిందన్నారు.
గోఉత్పత్తులు, గోసేవను మరింత పెంచడానికే మహారాష్ట్రలో గోసేవా కమిషన్‌ను ఏర్పాటు చేశామని పాటిల్ తెలిపారు. అంతేకాకుండా గోఆధారిత వస్తువులను మార్కెటింగ్ చేయడానికి కూడా గోకమిషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే గో ప్రొడక్ట్స్ విషయంలో అవగాహనా బాగా పెరిగిందన్నారు. గో ఆధారిత వ్యవసాయం కూడా చేస్తున్నారని పాటిల్ తెలిపారు.