చిలుకూరి ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి చేశారు. రంగరాజన్ ఇంట్లో వున్న సమయంలో వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి 20 మందితో కలిసి వచ్చి దాడికి దిగాడు. ఇంట్లోకి చొరబడి మరీ… విచక్షణ రహితంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో వీర రాఘవ రెడ్డి అర్చకులు రంగరాజన్ ని తీవ్రంగా దూషించారు. దీంతో ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దాడి చేసిన వీర రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రంగరాజన్ నివాసానికి వీర రాఘవరెడ్డి, అనుచరులు వచ్చి రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని కోరారు. అందుకు రంగరాజన్ నిరాకరించారు. దీంతో తన కుటుంబీకులను తీవ్రంగా హింసించారని, తనపైనా దాడి చేశారని రంగరాజన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.