చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన సేవా భారతి స్వావలంబన్‌

‌రాకీ, ఉషా, సీమా అనే ముగ్గురు అమ్మాయిలు తమ పెండ్లి వేడుకల్లో ఎంతో ఆనందంగా కనపడు తున్నారు. రాజస్థాన్‌లోని అనూప్‌గడ్‌ ‌సేవాభారతి ఆధ్వర్యంలో ఆ ముగ్గురి వివాహ వేడుకలు జరిగాయి.

నిరుపేద కుటుంబాలకు చెందిన ఆ ముగ్గురు యువతులకు ఒకప్పుడు తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. చుట్టుపక్కల ఇండ్లకు తిరిగి ఆహారం కోసం వేడుకునే దీనస్థితిలో వాళ్లు ఉండే వారు. ఆ సమయంలో వారు ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ సేవాభారతి ‘స్వాలంభన్‌ ‌సంస్థాన్‌’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృత్తి విద్యా శిక్షణ సంస్థ వల్ల వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. వివిధ రకాల కోర్సుల్లో శిక్షణ పొంది ప్రస్తుతం తమ సొంత కాళ్లపై నిలబడ్డారు. వారు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఒకప్పుడు చుట్టుపక్కల ఇండ్లలోకి వెళ్లి ఆహారం కోసం వేడుకునేది సీమ. కానీ ఇప్పుడు వివాహ వేడుకల్లో వధువుల చేతులను మెహెందితో అలంక రించడానికి నైపుణ్యం కలిగిన మెహెంది కళాకారిణిగా అదే ఇండ్లలోకి వెళుతోంది. మరో వైపు పూనమ్‌ ఇం‌టింటికి తిరిగి పప్పుధాన్యాలు సేకరించి వాటిపైనే జీవనం కొనసాగించేది. ఇప్పుడు సేవాభారతి శిక్షణ సంస్థలో కుట్టుపని, టైలరింగ్‌ ‌నేర్చుకుని సొంత టైలరింగ్‌ ‌షాపును తెరవాలను కుంటోంది. అదే ప్రాంతానికి చెందిన సీమ అనే మరో అమ్మాయి ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్‌గా శిక్షణ పొందుతోంది. అలాగే సునీత అనే యువతి డిగ్రీ పూర్తి చేసి పిల్లలకు ట్యూషన్లు చెబుతోంది.

ఇలా ఎంతోమంది యువతీ యువకులు సేవా భారతి శిక్షణ కేంద్రం వల్ల ప్రయోజనం పొందారు. అనుప్‌గఢ్‌ ‌ప్రాంతంలో సుమారు 110 కుటుంబా లలో సేవా భారతి వెలుగులు నింపింది. వారంతా సాన్సీ, బిహారీ, ధోలి, బాజిగర్‌ ‌సామాజికి వర్గానికి చెందిన వారు, పొట్టకూటి కోసం బిక్షాటన చేస్తూ జీవించేవారు. విద్యకు వారు ఎప్పుడూ ఆమడ దూరంగా ఉండేవారు. వారి జీవితాలు చీకటి, నిస్సహాయతతో నిండి ఉండేవి. ఒక్క పూట భోజనం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునేవారు. కానీ వారి జీవితాల్లోకి సేవాభారతి నూతనోత్తేజాన్ని తీసుకువచ్చింది. జోద్‌పూర్‌ ‌సేవాభారతి స్వలంభన్‌ ‌ప్రముఖ్‌ శ్రీ ‌దినకర్‌ ‌పరిఖ్‌, ‌ప్రాంతీయ శిక్షణా ప్రముఖ్‌ శ్రీ ‌గోవింద్‌ ‌కుమార్‌గార్ల 7-8 సంవత్స రాల నిరంతర కృషి కారణంగా ఈ అద్భుత పరివర్తనం సాధ్యమైంది.

ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌స్వయంసేవక్‌ శ్రీ ‌దినకర్‌ ‌పరిఖ్‌ ‌వారి పర్యటనలో భాగంగా ఒకసారి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు… ఇద్దరు చిన్న పిల్లలు చెత్తలో నుండి ఆహారం కోసం వెతుకుతున్న హృదయ విదారకర ఘటన ఆయన కంటపడింది. ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పిల్లలుపడే కష్టాన్ని చూసి ఆయన మనస్సు చలించిపోయింది. ఎలాగైనా వారిని ప్రయోజకులు చేసి వారిలో మార్పు తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పడే సేవాభారతి ఆధ్వర్యంలో స్వావలంభన్‌ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ విధంగా అనుప్‌ ‌ఘర్‌ ‌ప్రజల పరివర్తన ప్రయాణం ప్రారంభమైంది.

సేవా భారతీ ఆధ్వర్యంలో ముందుగా అక్కడి ప్రజలు నివసించే బస్తీలలో సాయంత్రం సమయాల్లో భజన కార్యక్రమాలు, నైతిక విలువలు సంబంధిం చిన తరగతులు నిర్వహించడం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రజలు ఆర్ధికంగా తమకాళ్లపై తాము నిలబడే విధంగా సేవా భారతి వారికి ప్రోత్సాహం, సహకారం అందించింది. ఆ పురుషుల కోసం వృత్తి విద్యా కోర్సులు ప్రారంభించబడ్డాయి. ఇందులో మంగలి, మెకానిక్‌ ‌మొదలైన వృత్తి విద్యా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. అనేక మంది యువకులు శిక్షణ పొందారు. 8వ తరగతి చదువుకున్న రామ్‌ అనే అనాథ యువకుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయంసేవకుల సహకారంతో ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని వాహనాలకు సీట్ల తయారీ చేసే పనిని పొందాడు. అతను ప్రస్తుతం సంపాదిస్తూ చదువు కొనసాగిస్తున్నాడు. అలాగే వికలాంగుడైన పవన్‌ ‌తనకు నలుగురు కుమార్తెలు ఉన్నందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. దినకర్‌, ‌రామ్‌రథన్‌లు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాలలో పవన్‌ ‌మంగలి వృత్తి శిక్షణ పొంది, ప్రభుత్వ పథకం కింద ఉద్యోగం సంపాదించుకున్నాడు. మంగలి శిక్షణ పొందిన వారంతా ప్రస్తుతం బిఎస్‌ఎఫ్‌ ‌సిబ్బందికి, ఖైదీలకు క్షవరం చేస్తున్నారు. పవన్‌తో సహా కొందరు తమ సొంత సెలూన్‌లను కూడా ప్రారంభించారు.

రోజువారీ కుటుంబ పోషణకే కష్టంగా ఉన్న అక్కడి ప్రజలకు తమ పిల్లలను పాఠశాలకు పంపడం తీరని కలగా ఉండేది. అలాగే అక్కడి పురుషులు మద్యానికి బానిసలవడంతో మరెన్నో సమస్యలు ఎదురయ్యేవి. కానీ సేవాభారతి సహాయంతో ప్రస్తుతం 250 మంది పిల్లలు సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. బడిలో చేరడానికి వారికి ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌స్వయంసేవకులు సహకారం అందించారు. శ్రీ సోమ్‌దత్‌ ‌కచోరియా (జిల్లా సహ మంత్రి, సూరత్‌గడ్‌) ‌మాట్లాడుతూ ఎవరైతే తమ పిల్లలను పాఠశాలకు పంపుతూ మద్యానికి బానిసలు కాకుండా నెలకు రూ.1000 జమ చేస్తారో వారికి బండ్లు పంపిణీ చేయబడతా యని తెలిపారు. ఇప్పుడు వారంతా మద్యానికి దూరమై సొంత పనులు చేసుకుంటూ వారి పిల్లలను చదివిస్తున్నారు.

మహిళా సంఘ సహ నిర్వహకురాలు భగవతి పారిఖ్‌ ‌మాట్లాడుతూ కమ్మరి పని చేసుకుంటూ జీవిస్తున్న యువకులకు కూడా సేవా భారతి ఒక చక్కటి అవకాశం కల్పించిందని చెప్పారు. వాళ్ళంతా కిసాన్‌ ‌కార్డు పొందారు. తద్వారా వారు వ్యవసాయ మార్కెట్లలో వివిధ పనిముట్లను అమ్ముకునే అవకాశం లభించిందని తెలిపారు.

 అనుప్‌గడ్‌ ‌మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జయ చౌదరి మాట్లాడుతూ మహిళలు కూడా టైలరింగ్‌లో శిక్షణ పొందారని, ఏడాది పొడవునా నడుస్తున్న ఇనిస్టిట్యూట్లలో ఇటువంటి 17 ట్రేడ్‌లు ఉన్నాయని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు రూమాళ్లు, దుస్తులు, బ్యాగులు మొదలైనవి తయారు చేస్తూ, అలాగే దీపావళి సందర్భంగా మట్టి దీపాలను, లక్ష్మీ దేవి, గణపతి విగ్రహాలను తయారు చేసి వాటిని విక్రయిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు.

ఇంతటి గొప్ప సంకల్పంతో సేవాభారతి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో విజయం సాధించింది. శిక్షణా శిభిరం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడి ప్రజలు సుమారు 100 మంది స్వయం సేవకులకు వారం రోజుల పాటు భోజనం అందించడమే అందుకు నిదర్శనం. సేవా భారతి చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల అన్ని వయసుల వాళ్లు, ఆడ, మగ అందరూ ఎదో రకంగా ప్రయోజనం పొందారు. ఒకప్పుడు ఆహారం కోసం వేడుకునే స్థితి నుంచి ఇప్పుడు నలుగురికి అన్నం పెట్టే స్థాయికి చేరారు అంటే వారిలో ఎంతటి పరివర్తనం వచ్చిందో తెలుస్తోంది. ఆర్థిక స్థిరత్వానికి, స్వయంగా ఆధారపడటం అని తెలిపే ఈ కార్యక్రమం నిజంగా అద్భుతమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *