చుక్క కూర
- ఈ చుక్కకూర బచ్చలి కూరని పోలి ఉంటుంది. పుల్లగా ఉంటుంది. అందుకే దీన్ని అన్ని ప్రాంతాలలో పుల్లబచ్చలి అంటారు.
- ఈ చుక్క ఆకులు దళసరిగా, పెళుసుగా ఉంటాయి. ఈ చుక్క ఆకులో జిగురు పదార్థం ఎక్కువుగా ఉంటుంది.
- తెలంగాణాలో దీన్ని ఎక్కువుగా వాడతారు.
- దీనిలో 2 రకాలు. అవి-చుక్కకూర, చిన్న చుక్కకూర.
- చుక్కకూర పుల్లగా, తియ్యగా ఉంటుంది. చిన్న చుక్క కూర పుల్లగా కొంచం వగరుగా ఉంటుంది.
- ఇది జఠరాగ్ని పెంచుతుంది.
- రుచిని పుట్టిస్తుంది.
- కఫం, వాతం పోగొడుతోంది. పిత్తాన్ని కలిగిస్తుంది.
- గ్రహణి, మూలరోగం, అతిసారం వంటి రుగ్మతలను తగ్గిస్తుంది.
- మలబద్దకాన్ని తొలగిస్తుంది.
- నోటిలో కొంతమందికి అతిగా లాలాజలం ఊరుతుంది.అది కఫ సంబంధమైన సమస్య ఆ సమస్యకి చుక్కకూర తరచుగా తీసుకోవడం వలన సమస్యకి అద్బుతంగా పనిచేయును.
- వాంతులని అరికట్టడంలో ఈ కూర అద్బుతంగా పనిస్తుంది.
- వేడిశరీరం కలవారికి ఈ కూర చాలా మేలు చేస్తుంది.
- జీర్ణకోశంలో ఏర్పడే మంటని, వేడిని ఇది తగ్గిస్తుంది.
- విషాదోషాలు పొగొడుతుంది.
- గట్టిగా ఉండే పుండ్లపై చుక్క ఆకు వేసి కడితే మంచి గుణకారిగా ఉంటుంది.
- చుక్క ఆకు వెచ్చచేసి దాని రసం చెవిలో పిండితే చెవిపోటు నయం అవుతుంది.
– ఉషాలావణ్య పప్పు