చైనా, పాకిస్తాన్ మినహా అన్ని పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు మెరుగయ్యాయి
చైనా, పాకిస్తాన్ మినహా అన్ని పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు గతంలో కంటే చాలా మెరుగయ్యాయి. ప్రస్తుతం చైనాతో సంబంధాలు అంతంతమాత్రమే. దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లగల, రక్షించుకోగల సామర్థ్యం, విశ్వాసం మనకు వుంది. ఈ పోటీ ప్రపంచంలో మేము కూడా పోటీపడతాం. చైనాతో భారత్ సంబంధాలు సవాళ్లతో కూడుకున్నదే. అయినా…. దేశ ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యం మాకు పుష్కలంగా వుంది.