జనప నారతో పెండ్లి పత్రిక… వైరల్ అవుతున్న వార్త
పెళ్లిని వినూత్నంగా చేయాలనుకోవడం ఓ అలవాటు. పర్యావరణ హితంగా చేయాలనుకోవడం బాధ్యత. అలవాటుకీ, బాధ్యతకీ చాలా అంతరం వుంటుంది. వరంగల్ లోని ఓ పెళ్లివారు మాత్రం తమ పెళ్లిని అత్యంత బాధ్యతగా, పర్యావరణ హితంగా చేయాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ లోని ఓ పెళ్లివారు తమ పెళ్లి పత్రికను జనపనారతో చేయించారు. దీనిని జనపనార బోర్డు ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ప్రదర్శించారు. అందరూ ఎంతో ఆకర్షితులయ్యారు. అలాగే కేవలం పెళ్లి పత్రికగానే కాకుండా చేతి సంచీలు వినియోగించేందుకు అనువుగా చేశారు. హనుమకొండ జిల్లా చింతట్టుకు చెందిన రమ్య దీనిని రూపొందించారు. ధర 45 రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.