జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే : ఐరాస వేదికగా భారత్ ప్రకటన

ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ దాయాది పాకిస్తాన్ పై తీవ్రంగా మండిపడింది. జమ్మూ కశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని భారత్ పునరుద్ఘాటించింది. కశ్మీర్ భారత్ లో అంతర్భాగంగానే వుంటుందని భారత్ తేల్చి చెప్పింది. భారత్ తరపున రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా పాక్ ను తీవ్రంగా దునుమాడారు. జమ్మూ కశ్మీర్ విషయంలో పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని, తన చర్యల ద్వారా వాస్తవాన్ని పాక్ ఎప్పుడూ మార్చలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సంక్రమించిన తమ ఓటు హక్కు ద్వారా జమ్మూ కశ్మీర్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఇప్పుడు అక్కడ కొత్త ప్రభుత్వం కొలువైందని, తప్పుడు ప్రచారాల ద్వారా పాక్ ఎప్పుడూ వాస్తవ పరిస్థితులను మార్చలేదని తేల్చి చెప్పారు.
ఐరాస జనరల్ అసెంబ్లీలో పీస్ కీపింగ్ మిషన్స్ చర్చల సందర్భంగా పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే భారత దేశం రైట్ ఆఫ్ రిప్లై ని ఎంచుకొని, ఉపయోగించుకుంది. ఈ సందర్భంగా పాక్ తప్పుడు ప్రచారాన్ని విజయవంతంగా భారత్ తిప్పికొట్టింది. జమ్మూ కశ్మీర్ భారత్ లో ఎప్పటికీ భాగంగానే వుంటుందని ప్రకటించారు. అంతర్జాతీయ వేదికపై భారత్ తన బలమైన వాదనను వినిపించడం ద్వారా భారత విదేశాంగ విధానం ప్రపంచానికి మరోసారి చాటిచెప్పినట్లైంది.ఐక్యరాజ్య సమితిలో వివిధ అంశాలపై 12 మంది ఎంపీల బృందం పాల్గొంటుంది. అందులో సుధాంశు త్రివేదీ ఒకరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *