జలాలాబాద్ పట్టణం ఇకపై పరుశురాం పురి : యూపీ సర్కార్ నిర్ణయం
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఉన్న జలాలాబాద్ పట్టణం పేరును ‘పరుశురాంపురి’గా మార్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన సమ్మతిని తెలిపింది. ఈ విషయంలో జారీ చేసిన ఉత్తర్వులో, ఈ పేరు మార్పుకు భారత ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పబడింది.
ఈ నిర్ణయం తర్వాత, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి , పిలిభిత్ ఎంపీ జితిన్ ప్రసాద్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో”ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని జలాలాబాద్ పేరును ‘పరుశురాంపురి’గా మార్చడానికి అనుమతి ఇచ్చినందుకు హోంమంత్రి అమిత్ షాకు హృదయపూర్వక ధన్యవాదాలు , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు , అభినందనలు. మీ మార్గదర్శకత్వం నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం సనాతన సమాజానికి గర్వకారణమైన క్షణాన్ని ఇచ్చింది” అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగ భగవాన్ పరశురాముడికి నమస్కరించి, ఇది సనాతన సమాజానికి గర్వకారణమని అన్నారు. పరశురాముని కృప వల్లనే ఈ పవిత్ర కార్యం సాధ్యమైందని ఆయన అన్నారు. ఈ పేరు మార్పు ప్రతిపాదనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 27న కేంద్ర ప్రభుత్వానికి పంపడం గమనార్హం, దీనిపై హోం మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది.