జాతీయ కార్మిక దినోత్సవం

సెప్టెంబరు 17 విశ్వకర్మ జయంతి  
విశ్వకర్మ ఉన్నత స్థాయికి చెందిన శిల్ప శాస్త్రజ్ఞుడు. తొలి ఇంజనీరు. సహజ జీవనానికి సంబంధించిన వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, తన అసామాన్య ప్రతిభతో అనేక రకాల పరికరాలను, యంత్రాలను రూపొందించాడు. విశ్వకర్మ తమ పూర్వీకుడు అయినందుకు  భారతీయు లంతా గర్వించాలి. విశ్వకర్మ రూపొందించిన పనిముట్లతో స్వీయ నిర్వహణతో సాగిన వృత్తులతో కూడిన ఆర్థిక వ్యవస్థ విలసిల్లింది. ప్రతి కుటుంబం తమదైన వృత్తి పరిశ్రమను నిర్వహించేది. వ్యవస్థీకృతమైన కుటుంబ పరిశ్రమల పరంపర విశ్వకర్మ నుంచే మొదలయ్యింది.

శ్రమకు సాధన తోడై, సమర్పణ భావం కూడా ఉంటే సమాజంలో సంపదలు వెల్లువెత్తుతాయి. శ్రమవలన సంపద సమకూరుతుంది. శ్రమయే యజ్ఞం. మన దేశ సంపూర్ణ వికాస సాధనలో పనిచేస్తున్న వారంతా విశ్వకర్మను స్మరించడం, అనుసరించడం అవసరం.
విశ్వకర్మ జయంతిని ‘‘జాతీయ కార్మిక దినోత్సవం’’గా భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ ‌జరుపుతోంది. జాతీయాభ్యుదయానికి బహుముఖ కృషి అవసరం. సంకల్పం, త్యాగ, తపః, బలిదానాల పునాదిపై కార్మికోద్యమాలను నిర్మించే  ప్రయత్నం చేస్తోంది. ఈ గుణాలకు ప్రతిరూపమైన భగవాన్‌ ‌విశ్వకర్మను ఆదర్శంగా భావిస్తోంది. విశ్వకర్మ జయంతి అయిన సెప్టెంబరు 17న దేశమంతా కార్మిక దినోత్సవం జరుపుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *