జార్ఖండ్‌లో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్
ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ఏటీఎస్, రాంచీ పోలీసులు కలిసి దేశ వ్యాప్తంగా 12 కి పైగా ప్రదేశాలు దాడులు నిర్వహించారు. ఇందులో ఢిల్లీ పోలీసులు ఓ ఇస్లామిక్ ఐసిస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. మరో 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అఫ్తాబ్ ముంబై నివాసి కాగా, అషర్ డానిష్ అనే మరో అనుమానితుడ్ని రాంచీలో అరెస్ట్ చేశారు.
మరోవైపు అనుమానితులందర్నీ విచారిస్తున్నామని పోలీసులు ప్రకటించారు. అజార్ డానిష్ వద్ద నుంచి కొన్ని డిజిటల్ పరికరాలు, పాస్‌పోర్టులు, ఐడియాలజీకి సంబంధించిన డేటా వంటి ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అజార్ డానిష్‌పై ఢిల్లీలో గతంలో ఒక కేసు నమోదు కావడంతో, అతడిని అరెస్టు చేయడానికి ఢిల్లీ స్పెషల్ సెల్ ప్రత్యేకంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. అజార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఐసిస్ నెట్‌వర్క్ దేశంలో ఇంకా ఏ స్థాయిలో విస్తరించిందన్న దానిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.