జూన్ 29 నుండి అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. ఈ నెల 15 నుండి రిజిస్ట్రేషన్లు

అమర్‌నాథ్‌ యాత్రికులకు శుభవార్త. అమర్‌నాథ్‌ యాత్ర ఈ యేడాది జూన్‌ 29 నుంచి ప్రారంభం కానుంది. దీని కోసం రిజిస్ట్రేషన్లను ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ట్రస్ట్‌ పేర్కొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వుండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించామని ట్రస్ట్‌ ప్రకటించింది. ఇక.. ఈ యాత్ర సందర్భంగా భద్రతాపరమైన విషయాలపై జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. యాత్రకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించారు. ఈ యేడాది జూన్‌ 29 వ తేదీ, అష్టమి తిథి మధ్యాహ్నం 2:19 గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది. ఆగస్టు 19తో యాత్ర ముగుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *