జోధ్ పూర్ వేదికగా ప్రారంభమైన ‘‘సంఘ సమన్వయ బైఠక్’’

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ‘‘సమన్వయ బైఠక్’’ జోధ్ పుర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది. సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే భారత మాత చిత్ర పటానికి పుష్పార్చన చేశారు. అలాగే సంఘటనా మంత్ర పఠనంతో లాంఛనంగా ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 5 నుంచి 7 వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి.
rss2
ఈ సమావేశాల్లో సహ సర్ కార్యవాహలు, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు అలోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ్ సంచాలిక శాంతక్క, కార్యవాహిక సీతా గాయత్రి, ఏబీవీపీ అధ్యక్షులు రాజ్ శరణ్ షాహీ, సంఘటనా మంత్రి ఆశీష్ చౌహాన్, సక్షమ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దయాల్ సింగ్ పవార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే పూర్వ సైనిక్ సేవా పరిషత్ అధ్యక్షులు జనరల్ విష్ణుకాంత్ చతుర్వేదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, సంఘటనా మంత్రి బీ.ఎల్. సంతోష్, వనవాసీ కల్యాణాశ్రమం అధ్యక్షులు సత్యేంద్ర సింగ్, సంఘటనా మంత్రి అతుల్ జోగ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *