ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ
ఢిల్లీ లో 2020 లో జరిగిన అల్లర్ల కేసులో నిందితులుగా వున్న షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్ ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లతో పాటు అథర్ ఖాన్, అబ్దుల్ ఖలీద్ సైఫీ, మహ్మద్ సలీం ఖాన్, షిఫా-ఉర్-రెహ్మాన్, మీరాన్ హైదర్, గుల్ఫీషా ఫాతిమా, షాదాబ్ అహ్మద్‌ల బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.ఉద్దేశ పూర్వకంగానే కుట్ర చేసి, వారు అల్లర్లకు పాల్పడ్డారని, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు నిర్దోషులగా తేలే వరకు జైల్లో వుండడమే సరైందని సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదించారు.వీళ్లు చేసింది సాధారణ నేరమే కాదని, పకడ్బందీ వ్యూహం ప్రకారమే ఢిల్లీ అల్లర్లకు ప్రణాళికలు వేశారన్నారు.
ఈ కేసులో ఇమామ్, ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్లు 2022 నుంచి పెండింగ్‌లో ఉండగా.. తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది.బెయిల్ పిటిషన్లపై విచారణ జరుపుతూ, “అన్ని అప్పీళ్లను కొట్టివేస్తున్నాము” అని జస్టిస్ నవీన్ చావ్లా మరియు షాలిందర్ కౌర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
సీఏఏను వ్యతిరేకిస్తూ 2020 లో ఈశాన్య ఢిల్లీ లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ కుట్రలో ఇమామ్, ఖలీద్ తో పాటు మరి కొందరు కుట్రదారులుగా వున్నారు. ఈ హింస కారణంగా 50 మందికి పైగానే మరణించారు. మరో 700 మందికి గాయాలయ్యాయి. ఈ హింసలో ప్రధాన కుట్రదారులపై UAPA కింద అభియోగాలు మోపారు.