తదుపరి లక్ష్యం ఉపమండలం వరకు శాఖల విస్తరణ
– విలేకరుల సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేశ్
ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ సమావేశాలు బెంగళూరులో ఈ నెల 19, 20 తేదీలలో జరిగాయి. ఈ సమావేశాల విశేషాలను ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణా ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేశ్ వివరించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60867 కేంద్రాలలో నిత్యం, వారం, నెల శాఖలు 73860 జరుగు తుండగా తెలంగాణాలో 2069 కేంద్రాలలో 2789 శాఖలు జరుగుతున్నాయని వివరించారు. రాగల మూడేళ్లలో ప్రతి ఉపమండలానికి శాఖల విస్తరణ చేయాలనే లక్ష్యం నిర్ణయమైందని, ఆ దిశగా పని సాగుతుందని శ్రీ రమేశ్ తెలిపారు.
మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా 43 రోజుల పాటు చేపట్టిన నిధి సమర్పణ అభియాన్‌లో తెలంగాణలో 12719 గ్రామాలలో 1.94 లక్షల కార్యకర్తలు 68.59 లక్షల కుటుంబాలను కలిశారని తెలియజేశారు.
కోవిడ్ సమయంలో స్వయంసేవకులు అనేక రకాల సేవ కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలిచారు. 92000 కేంద్రాలలో 507000 కార్యకర్తలు 4.66 కోట్ల భోజన పొట్లాలు, 73.81 లక్షల రేషన్ కిట్స్ 89.23 లక్షల మాస్క్‌ల వితరణ చేశారు. నగరాలలో చిక్కుకపోయినవారికి వసతి, రక్త దానం, ఆయుర్వేద కషాయ వితరణ, వలస కార్మికులకు 145000 మందికి దారిలో భోజనం, వైద్యం, నీరు అందించారు. రైళ్లు ప్రారంభం అయ్యాక యాత్రికులకు భోజన సౌకర్యం కలిగించారు. పూణేలో కోవిడ్ సెంటర్ హైదరాబాద్‌లో డాక్టర్ల ద్వారా ఆన్‌లైన్ కౌన్సిలింగ్‌ను సంఘ స్వయం సేవకులు నిర్వహించారు. తెలంగాణలో 2932 స్థలాల్లో 27414 కార్యకర్తలు 2.54 లక్షల రేషన్ కిట్స్, 4.37 లక్షల భోజన ప్యాకెట్లు, 1.83 లక్షల మాస్కులు వితరణ చేశారని తెలిపారు.