తెలంగాణ ”లఘు ఉద్యోగ భారతి” నూతన కార్యవర్గం ప్రకటన
లఘు ఉద్యోగ భారతి వార్షిక సభ్య సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి లఘు ఉద్యోగ భారతి అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి ప్రకాశ్ చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత లఘు ఉద్యోగ భారతి బాధ్యులు రెండు సంవత్సరాల ప్రగతి నివేదికను, ఆర్థిక నివేదికను సమావేశం ముందు వుంచారు. తదనంతరం తెలంగాణ ప్రాంత లఘు ఉద్యోగ భారతి నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా లఘు ఉద్యోగ భారతి అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి సంస్థ లక్ష్యాలను వివరిస్తూ మార్గనిర్దేశనం చేశారు.ఆ తర్వాత లఘు ఉద్యోగ భారతి అఖిల భారతీయ సంయుక్త కార్యదర్శి మొహం సుందరం సంస్థను ఎలా విస్తరించాలో మార్గదర్శనం చేశారు.
దీని తర్వాత తెలంగాణ ప్రాంత లఘు ఉద్యోగ భారతి నూతన కమిటీని ప్రకటించారు. నూతన అధ్యక్షులుగా వసంతమ్ వేంకటేశ్వర్లు, కార్యదర్శిగా కందుల నరేంద్రనాథ దత్, కోశాధికారిగా అనూజ్ ఖండేల్వాల్, సంయుక్త కార్యదర్శిగా సంతోష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సుధాకర శర్మ, ప్రభారీగా శ్రీధర్ రెడ్డి, తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శిగా శివరాం బాధ్యతలు స్వీకరించారు.