తొలి షాలో వాటర్ నౌక ‘‘ఆర్నా’’ నౌకాదళంలోకి
జలాంతర్గాముల వ్యతిరేక పోరాటం జరిపే తొలి షాలో వాటర్ నౌక ‘‘ఆర్నా’’ భారత నౌకాదళంలోకి వచ్చేసింది. సాగర జాల నుంచి ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ భారత దేశాన్ని కాపాడటం దీని లక్ష్యం. ఇది 1490 టన్నుల బరువు, 77.6 మీటర్ల పొడవు గల ఈ యుద్థ నౌక డీజిల్ ఇంజన్ – వాటర్ జెట్ సంయుక్త విద్యుత్ కాంబినేషన్ లో నడుస్తుంది. ఈ నౌకను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించారు. 80 శాతం దేశీయ సాంకేతికతతో నిర్మించిన ఈ ఆర్నాల రక్షణ తయారీలో ఆత్మనిర్భర్ భారత విజయానికి ఓ ప్రతీకగా నిలుస్తుంది.
55 పైగా మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్నాయి. దీని వల్ల దేశీయ పరిశ్రమ ఉత్తేజితం కావడంతో పాటు సంబంధిత ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఉపయోగపడుతుంది. ఇది భారత నౌకాదళ సామర్థ్యాలను పెంచడంతో పాటు కోస్తా భద్రతను కూడా పటిష్టం చేస్తుంది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యత గల స్వయం సమృద్ధ సాగర శక్తిగా భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.