దూరంగా వున్నా.. హృదయాలు దగ్గరే వున్నాయి : సునీతా విలియమ్స్ కి మోదీ లేఖ
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలు గడిపిన తర్వాత నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రాబోతున్నారు. ISSలో చిక్కుకుపోయిన సునీత, విల్మోర్లతో స్పేస్ఎక్స్ క్యాప్సూల్ క్రూ-9 బయలుదేరింది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత, సునీత విలియమ్స్ త్వరలో భారతదేశానికి రావచ్చు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు సునీత విలియమ్స్‌కు ఒక లేఖ రాశారు. క్షేమంగా భూమికి చేరుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని, ఆ వెంటనే భారతదేశానికి రమ్మని ఆహ్వానించారు.
భారత ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఒక కార్యక్రమంలో ప్రముఖ వ్యోమగామి మైక్ మాసిమినోను కలిశాను. సంభాషణ సమయంలో సునీత పేరు ప్రస్తావనకు వచ్చింది. సునీత గురించి, ఆమె పని గురించి ఎంత గర్వపడుతున్నామో చర్చించుకున్నాము. దీని తర్వాత లేఖ రాయకుండా ఉండలేకపోయాను.’’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , మాజీ అధ్యక్షుడు బిడెన్‌ను కలిసినప్పుడల్లా, సునీత గురించి అడిగేవాడినని. మీ విజయాల పట్ల 140 కోట్ల మంది భారతీయులు ఎల్లప్పుడూ గర్వపడుతున్నారు. ఇటీవలి సంఘటనలు మీ స్ఫూర్తిదాయకమైన దృఢ సంకల్పాన్ని గుర్తు చేశాయి. భారత ప్రజలు మీ ఆరోగ్యం కోసం, మిషన్ విజయం కోసం ప్రార్థిస్తున్నారు. అంటూ ప్రధాని రాసిన లేఖలో పేర్కొన్నారు.మీ తల్లి బోనీ పాండ్యా మీరు సురక్షితంగా తిరిగి రావడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, దివంగత దీపక్ భాయ్ ఆశీస్సులు కూడా మీకు ఉన్నాయని పూర్తిగా నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాశారు.