నగ్జలైట్ల లొంగుబాట్లు పెరిగాయ్… వ్యూహాలు ఫలిస్తున్నాయ్..
ఛత్తీస్ గఢ్ లో తాజాగా 50 మంది నగ్జలైట్లు లొంగిపోయారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట మోస్ట్ వాంటెండ్ నగ్జలైటు, కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ బాడీగార్డు సోనూ హేమ్లాతో పాటు 50 మంది లొంగిపోయారు. పీఎల్జీఏ బెటాలియన్ నెంబర్ 1 నుంచి ఒకరు, నెంబరు 2 నుంచి నలుగురు, కంపెనీ 7 నుంచి ఒకరు. నేషనల్ పార్క్ కుతుల్ ఏరియా కమిటీ ప్లాటూన్ నెంబర్ 2 నుంచి ఇద్దరు, ఇతర విభాగాలకు కూడా లొంగిపోయిన వారిలో వున్నారు. అయితే.. ఈ 50 మందిలోని 14 మంది నగ్జలైట్లపై 68 లక్షల రివార్డు వున్నట్లు పోలీసులు ప్రకటించారు. మరోవైపు వీరికి తక్షణ సాయం కింద 25 వేల చొప్పున సాయం అందించారు.
మరోవైపు మరో కీలకమైన లెక్క కూడా వెలుగులోకి వచ్చింది. ఈ యేడాదిలో ఇప్పటి వరకు మంది 280 నక్సలైట్లు, జన్ మిలీషియా సభ్యులు లొంగిపోయారు. ఇక, 2024లో ఛత్తీస్‌గఢ్‌లో మొత్తంగా 787 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారు. నక్సల్స్ ఆయుధాలను వీడేలా సంప్రదింపులు జరిపి, ఒప్పించడంలో సీఆర్‌పీఎఫ్ నిఘా విభాగం కీలకంగా వ్యవహరిస్తోంది.ఛత్తీస్‌గఢ్‌లో 20 బెటాలియన్లు, కోబ్రా యూనిట్‌తో యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో సీఆర్‌పీఎఫ్ కీలకంగా ఉంది. తమ వ్యూహం ఫలించిందని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం వద్ద వున్న సమాచారం ప్రకారం దేశంలో మావోయిస్టుల హింసాత్మక ఘటనలు 81 శాతం మేర తగ్గాయి. పౌరులు, భద్రతా బలగాల మరణాలు 85 శాతం తగ్గాయి.