పదేళ్ల బాలుడు ఆరివ్ కే. రావుకి భారత యువ గౌరవ పురస్కారం
పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్న పదేళ్ల బాలుడు ఆరివ్ కే. రావుకి భారత యువ గౌరవ పురస్కారం లభించింది. కర్నాటకలోని సేడం కేంద్రంగా జరుగుతున్న భారతీయ సంస్కృతి ఉత్సవ్ లో ఈ అవార్డును ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణలో చురుగ్గా నిమగ్నమై వుండే ఆరివ్ చెట్ల పెంపకం, అటవీ పునరుద్ధరణ, నీటి సంరక్షణపై విశేషంగా దృష్టి సారించాడు. అయితే అతని నిబద్ధతలో ఏమాత్రం లోపం లేదు. పర్యావరణ పరిరక్షణ కోసం విశేషంగా ప్రయత్నాలు చేస్తున్నా… పర్యావరణ పరిరక్షణ ప్రపంచంలోనే అత్యంత సవాల్ గా మారిపోయింది.ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు, స్థిరమైన భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం తనతో కలిసి రావాలని పిలుపునిచ్చాడు. 2024 లో ఆరివ్ విజయవంతంగా 2,000 చెట్లను నాటాడు. 2025 లో మరింత ఎక్కువగా, తన లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలని సంకల్పించాడు.